ప్రియా! నిన్ను చూసిన తొలి క్షణమే
నీ రూపం నన్ను పిచివాన్ని చేసింది
ఆ క్షణమే నా జీవితం
నీతో పంచుకోవాలనుకున్నాను
మరువలేని నీ వ్యక్తిత్వం
మరపు రాని నీ చిరునవ్వు
నాకు కాకుండా మరో వ్యక్తికి అంకితమైతే
నా జీవిత యానంలో చీకటి అలుముకుంటుంది
గతి తప్పుతున్న నీ నడవడిక
ఛిద్రం కాకముందే ముందే మేలికో
నా ప్రేమ బంధం విలువ తెలుసుకో
ఎండమావులు నీ జీవితంలో
అలుముకోక ముందే
సెలయేటిని వెతికి పట్టుకో
స్నేహపు తియ్యదనం ఆశించే నీకు
చేదు అనుభవం ఎదురుకాకముందే
నీవు నమ్మిన వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకో
నమ్మక ద్రోహం అనే విష సర్పం
నిన్ను కాటేయక ముందే
నిజమైన ప్రేమామృతపు విలువ తెలుసుకో
నీవు ఆశించింది నీకు దక్కనప్పుడు
నిన్ను ఓదార్చేందుకు ఒక్కరూ రారు
అదే నీ జీవితం ఛితికినప్పుడు
ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారు
నలుగురిలో నవ్వులపాలు కాకముందే
నీ బ్రతుకును నందనవనం చేసుకో
అనురాగం, ఆప్యాయతల్ని
నీ కోసం పంచే అదృష్టాన్ని వెతుక్కో
అవే కరువైతే జీవితానికి చరమ గీతం తప్పదు.
నీ రూపం నన్ను పిచివాన్ని చేసింది
ఆ క్షణమే నా జీవితం
నీతో పంచుకోవాలనుకున్నాను
మరువలేని నీ వ్యక్తిత్వం
మరపు రాని నీ చిరునవ్వు
నాకు కాకుండా మరో వ్యక్తికి అంకితమైతే
నా జీవిత యానంలో చీకటి అలుముకుంటుంది
గతి తప్పుతున్న నీ నడవడిక
ఛిద్రం కాకముందే ముందే మేలికో
నా ప్రేమ బంధం విలువ తెలుసుకో
ఎండమావులు నీ జీవితంలో
అలుముకోక ముందే
సెలయేటిని వెతికి పట్టుకో
స్నేహపు తియ్యదనం ఆశించే నీకు
చేదు అనుభవం ఎదురుకాకముందే
నీవు నమ్మిన వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకో
నమ్మక ద్రోహం అనే విష సర్పం
నిన్ను కాటేయక ముందే
నిజమైన ప్రేమామృతపు విలువ తెలుసుకో
నీవు ఆశించింది నీకు దక్కనప్పుడు
నిన్ను ఓదార్చేందుకు ఒక్కరూ రారు
అదే నీ జీవితం ఛితికినప్పుడు
ప్రతి ఒక్కరూ ఆరా తీస్తారు
నలుగురిలో నవ్వులపాలు కాకముందే
నీ బ్రతుకును నందనవనం చేసుకో
అనురాగం, ఆప్యాయతల్ని
నీ కోసం పంచే అదృష్టాన్ని వెతుక్కో
అవే కరువైతే జీవితానికి చరమ గీతం తప్పదు.