ఎంత గొప్పవి కన్నీళ్లు కదా
ఏడుస్తూ పుట్టి...
ఏడుస్తూ మట్టిలో కలిసే వరకు
మనిషి కి తోడుండే నేస్తాలు అవే కదా
తాత్కాలిక జీవితమనే ప్రయాణంలో
కన్నీళ్లే...ఆసరా ఆలంబక కదా..?
కొండంత గుండె బరువెక్కి నిండితే...
గండి పడిపరవళ్లు తొక్కుతూ ఏంచక్క...
చెక్కిళ్లపై కన్నీళ్లు నాట్యం చేస్తూ
మనస్సులో చేరి గాయపడ్డ
హృదయాన్ని సేదతీరుస్తాయి
మనసున్న
ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాయ!
నమ్మిన మనుషులు అవమానించి నప్పుడు
మనల్ని...
పరామర్శించేందుకు
ఏదో ఒకప్పుడు హృదిలో దూరి...
ఓ మూల సవ్వడి చేస్తూ
కవ్విస్తుంటాయ!
ఒక్కో కన్నీటి చుక్క...
ఆవేదనకు ప్రతీ అయతేనేం?
అప్పుడప్పుడు...
ఆనందానికీ ఓ జ్ఞాపిక ఆ కన్నీళ్ళే కదా..?