. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 20, 2013

నిద్ర నాకెందుకు రాదు? నీకు తెలుసో లేదో

నిద్ర నాకెందుకు రాదు? నీకు తెలుసో లేదో
నా కలలకు రెప్పల ముద్దు కావాలి
ఈ రేయికి వెన్నెల ముద్దు కావాలి
సంద్రానికి తీరపు తడి శ్వాస కావాలి

నీ వెచ్చని ఊపిరి నేనైపోవాలి
నీ కలల తీరాల్లో నేను కరిగిపోవాలి


నీ వెచ్చని ఒడి కావాలి 

మరి నీ నవ్వు కావాలి
నీ చేయి తగిలిన స్పర్శ నన్ను వెంటాడుతూందని
నీకు గానీ నీ మనసుకు గానీ ఏనాడైనా
తోచిందా మరి తోచినా .... దాచావా? దాస్తున్నావా
నే అడగని వరం నాకై వచ్చినప్పుడు నా హృదయం
నీ గుండె  చప్పుడూ నీ నవ్వూ నీ మాటా 

నా మది గదిలో దాచిన నీ వలపు తెరలు
నీవు నేను ఏకాంతంగా ఏకమైపోవాలి ప్రియా
ఈ రాత్రి  మన మధ్య ఓ కొత్త పరిమళాన్ని
సరికొత్త భావలను ఇస్తాయని  అనిపిస్తోంది ఎందుకో
ఎందుకీ క్షణాలు నన్నూ నా నిద్రనూ నీ నుంచి
దూరం చేస్తున్నాయి? కళ్ళన్నీ ఎర్రగా మారాయి

కౌగిలితల్లో కాలాన్ని కరిగించాలనుకున్నాం కదా
ఓ కొత్త ఉదయపు ముద్దు కోసమేనా? నా ఈ ఆత్రం
ఈ రాత్రి వెన్నెల రాత్రి కావాలి..కవ్వింతల రాత్రవ్వాలి
మనిద్దరం జాబిలి వెన్నెళ్ళో తడిచి ముద్దవ్వాలి