ఎందుకో రేతిరి గాలుల్లొ నెమ్మదిగ ఒదిగిన క్షణాలు
తరగని దూరాలతో బరువుగా నిట్టూర్పులు విదుల్చుతున్నాయి
ఎదలోతులోకి ఎగబాకిన నల్లటి చీకటి
ఇక రాకు అంటూ నన్ను వెనక్కి నెట్టివేస్తున్నాయి
బాధ్యత నిండిన కనురెప్పల చప్పుళ్ళు
బంధం తుంచుకోమని నన్ను ఆదేశిస్తున్నాయి
దూరాన తళుక్కుమంటూ మురిపించిన నీ మాటలు
సంద్రపు హోరులో నిన్నువెతుక్కోమంటూ
మౌనం వహిస్తున్నాయి
మౌనం వహిస్తున్నాయి
చెరిగిన దూరాలు నా దారిని కలిపేలోపు
ఎన్నెన్నో యోజనాల ఆవలికి ఎగిరిపోయావు
విసిగిన మనసు తూటాలుగా నన్ను పొడించిందేమో
నువు అల్లిన పరదాలు నా దారినిండా కమ్ముకున్నాయి
నా కంటి నిండా కన్నీళ్ళను నింపాయి అదినీకు ఆనందమా.?..ప్రియా
ఒత్తిళ్ళల్లో ఒదిగిన తపన తమాయించుకుంటూ
ఒంటరి క్షణాలతో కూడి ప్రణవ నాదం చేస్తున్నాను
ఎవరికి వినిపించకుండ రోదిస్తున్నాను