నన్ను మారమన్నారు..
అక్షరాల్లో ఆనందాన్ని పంచమన్నారు
నిలువునా దహించుకపోయే కన్నా
నలుగురికి ఆనందానివ్వమన్నారు
నాకు నేను .. నాలోనేను
కనిపించకుండా పోయిన క్షనాల్లో
అక్షరాళ్ళో ఆనందాన్ని కూర్చాలన్నా
కూరుకపోయి కుళ్ళీపోయిన జ్ఞాపకాలు
నన్ను కురూపిగా మార్చాయి
మారాలని ఎంత ప్రయత్నిచినా
ఏదో అదృస్యి శక్తి నన్ను లాగేస్తుంది
మారాలని ఉన్నా నీవింతే మారలేవు అంటూ
ఆనందపు జళ్ళులు కురిపించాలని మేఘాలనుకున్నా
ఉరుములు భయపెట్టి..
కన్నీటి జల్లు కురిపించేలా చేస్తున్నాయి
అక్షారాలను పేర్చడం మొదలు పెట్టగానే
నాలో పొంగే ఉద్వేగం..
నాలో మార్పు తీసుకరాలేకపోతున్నాయి
రాయాలని మొదలు పెడతానా..
అప్పటిదాకా ఎక్కడ ఉంటాయో
జ్ఞాపకాలు కందిరీగలమళ్ళే నా మనసును చుట్టూముట్టి
మనస్సును రక్తం వోడేలా కుట్టేస్తాయి
మరినేను ఆనందపు అక్షరాలు ఎలా కూర్చను సార్
జరిగిన అవమానాలు ...
కళ్ళెదురుగా జరుగుతున్న సంఘటనలు
ఎప్పటికప్పుడు మారాలని ఉన్నా ..
నన్ను వెనక్కు నెట్టేస్తున్నాయి
నేనింక మారలేనేమో ..
మోసం చేసే మనుషులు చుట్టు ఉన్నారు
అభిమానాన్ని .. ఆప్యాయతను నాతో నటించి
మరొకరి వంచన చేరి నన్ను అవమానిస్తుంటే
మళ్ళీ నన్నే నీవెవరని అడిగితే నేగనెలా రాయగలను
అక్షరాల్లో ఆనందాన్ని పంచమన్నారు
నిలువునా దహించుకపోయే కన్నా
నలుగురికి ఆనందానివ్వమన్నారు
నాకు నేను .. నాలోనేను
కనిపించకుండా పోయిన క్షనాల్లో
అక్షరాళ్ళో ఆనందాన్ని కూర్చాలన్నా
కూరుకపోయి కుళ్ళీపోయిన జ్ఞాపకాలు
నన్ను కురూపిగా మార్చాయి
మారాలని ఎంత ప్రయత్నిచినా
ఏదో అదృస్యి శక్తి నన్ను లాగేస్తుంది
మారాలని ఉన్నా నీవింతే మారలేవు అంటూ
ఆనందపు జళ్ళులు కురిపించాలని మేఘాలనుకున్నా
ఉరుములు భయపెట్టి..
కన్నీటి జల్లు కురిపించేలా చేస్తున్నాయి
అక్షారాలను పేర్చడం మొదలు పెట్టగానే
నాలో పొంగే ఉద్వేగం..
నాలో మార్పు తీసుకరాలేకపోతున్నాయి
రాయాలని మొదలు పెడతానా..
అప్పటిదాకా ఎక్కడ ఉంటాయో
జ్ఞాపకాలు కందిరీగలమళ్ళే నా మనసును చుట్టూముట్టి
మనస్సును రక్తం వోడేలా కుట్టేస్తాయి
మరినేను ఆనందపు అక్షరాలు ఎలా కూర్చను సార్
జరిగిన అవమానాలు ...
కళ్ళెదురుగా జరుగుతున్న సంఘటనలు
ఎప్పటికప్పుడు మారాలని ఉన్నా ..
నన్ను వెనక్కు నెట్టేస్తున్నాయి
నేనింక మారలేనేమో ..
మోసం చేసే మనుషులు చుట్టు ఉన్నారు
అభిమానాన్ని .. ఆప్యాయతను నాతో నటించి
మరొకరి వంచన చేరి నన్ను అవమానిస్తుంటే
మళ్ళీ నన్నే నీవెవరని అడిగితే నేగనెలా రాయగలను