. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 14, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(2)

1) చూడలేని అంధునికి రంగు రంగుల అందాలేందుకు చెప్పలేని మూగవాడికి చెప్పుకోలేని మధురమయిన భావాలేందుకు ...?


2) కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది


3) నీ జ్ఞాపకాలు అనుక్షణం వెంటాడుతూ నాతో పోరాడతాయి నే పోరాడలేనని ఎదిరిస్తే నాకు దూరమై శిక్షిస్తాయి...మనసుని గాయాల పాలు చేస్తాయి


4) జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి వచ్చిపోయే పున్నములయినా అవి పంచే వెన్నెలే) నిలిచే నీడలవుతాయి


5) నీవు మిగిల్చిన శూన్యం అనే నా ఈ ప్రపంచంలో,
మన జ్ఞాపకాల దొంతర తీసి నీ చిరునవ్వులు వినిపిస్తాఏమో అని చూస్తే...నా హ్రుదయ రోదనలు మాత్రమే వినిపిస్తున్నాయి నా భాద ఎవ్వరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ప్రియా


6) గతంలో నీ మాటలు చల్లని చినుకు తుంపరులై మనసును తడిపాయి..వర్తమానం లో ఆ తుంపరుల కోసం ఎంత వెతికినా జాడేలేదు ఎందుకని ప్రియా


7) వర్తమానంలో అన్నీ కోల్పోయి విషాదంలో ఉన్నాను..గతంలేని వర్తమానాన్ని నేను జీర్నించుకోలేకపోతున్నా "ప్రియా"


8) నన్ను నిదురకు దూరం చేసింది నీ జ్ఞాపకం గతం లోకితొంగి చూస్తూ...పదే పదే మది తలుపుతు తడుతున్నాయి...మూగపోయిన నీపలుకులు ఘనీబవించాయి మిత్రమా


9 ) తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మదిని కలవర పెడుతూమబ్బుల "లాస్యం"


10) మబ్బుల ప్రసవం కోసం ప్రకృతి రంగం సిద్ధం చేసింది.పురిటినెప్పులొస్తున్నాయేమో ఉరుముతూ అరుస్తుంది ఆకాశం.. ఏ క్షనమైనా ...?


11) కన్నెర్ర జేసిన నింగి నుదిటిన స్వేద బిందువులు
చిరు చీకట్లు పడుతుండగానే చిరుజల్లుగుగా కురుస్తున్నాయ ఈవేళ


12) నిదురలో కలిగే ఆనందాన్ని నాకు దక్కనీయవా
ఆ కాస్త ఆనందాన్ని కూడా నీజ్ఞాపకాలు తరిమేస్తున్నాయి


13) ఏ ఆనందము నాకు మిగిల్చని నువ్వు
నా విషాదాన్ని ఆనందిస్తున్నావని తెల్సి ఏంచేయాలి...?


14) నా నవ్వులు నీకు పంచాలని నా కలలో నిన్నే చూడాలని చుక్కలన్ని నీ ముంగిట దింపాలని కన్న కలలన్నీ కళ్ళలు అయ్యాఎందుకో


15) మబ్బులున్నా ఏ మేఘము నన్ను  ఓదార్చదెందుకని మండే ఎండకి పడే వానకి వీచే గాలికి అలుసయ్యాను ఎందుకో


16) నా గుండెలో రేపిన అలజడి ఎంతో తెలుసా
మనసు కన్నీళ్ళుతో మేఘమై వర్షినట్టుగా ఉందీ రోజు


17) చిన్నబోయిన వెన్నెల జాబిలి నల్ల మబ్బు చాటు చేరి చిన్న చినుకుల్లా కన్నీరు కారుస్తుందేమో


18) కళ్ళలో ఇంకిన కన్నీటికి విలువ తరిగిపోయింది
మోడువారి గుండె నీ అవమానాల యాసిడ్ దాడితో కాలిపోయింది


19) నా స్వప్న సౌధపు పునాదులను ఎవరో పెకిలిస్తున్నారు దగ్గరుండి నీవే ఆపని చేయిస్తుంటే మౌనంగా రోదించడం తప్పించి ఏం చేయను


20) నీవు నన్ను బలిపీఠం ఎక్కించేందుకే ప్రయత్నిస్తున్నావు బలౌతున్నది నేను భాద పడుతున్నది నేను..నా బాధాలో నీకు అంత ఆనందం దొరుకుతుందా ప్రియా


21) కరిగిపోతున్న కాలాన్ని..కన్నీరు ఆపలేకపోతోంది..నేరం నాది కాకున్నా నేరస్తున్ని చేస్తున్నావు..అవమానించడం హాబీగా పెట్టుకున్నావెందుకు ప్రియా


22) హృదయాన్ని కన్నీళ్లలో స్నానం చేయించింది దుఃఖమే ఏ కన్ను యేడ్చినా..నొప్పి గుండెల్లోనే వస్తుంది అది నీజ్ఞాపకం గుచ్చిన భాదేమో


23) దుఃఖం నన్ను చిన్నచూపు చూస్తుంది
కన్నీటి రుచియేమిటో దుఃఖమే నాకు రుచి చూపించింది


24) నా గుండె గదిలో అన్ని నీవదిలిన జ్ఞాపకాలే
చెరపలేని చెరిగిపోని నీ పాద ముద్రల అడులే ప్రియా


25) చిరుగాలులతో చినుకు వానలావచ్చి
నన్ను తనువంతా పులకరించేలా తడిపి పలకరించి పోవా