ఈ రాత్రి తలువు మూసింది కాసేపటీ క్రితమే
వెలుగులతో ఉదయపు తెరలు తెరుచుకున్నాయి
రోజు ఎంత వెలిగితే నేం.. నా మనస్సు ఓడి
నన్నొదిలి వెల్లి పోయింది బయటకెల్లింది
ఏకాంతాన్ని కప్పుకుని నాలోనేనే దూరిపోయాను
ఎప్పట్లాగానే విషాదాన్ని నాలో నింపుకొని
జ్ఞాపకాల ముళ్ళపై మళ్ళీ ప్రయానం మొదలౌతుంది
నా ఏకాంతం నన్నొదిలి దూరంగా వెళ్ళిపోయింది
నిశ్శబ్దపు నిశీధుల్లోకి నా స్వరం తప్పిపోయింది
కనురెప్పల సరిహద్దుపైన కన్నీళ్ళే గెలిచాయి
ఆ చీకటి ముసుగులో నన్ను నేను వెతుక్కుంటున్నాను