. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 20, 2013

ఎన్ని సార్లని చచ్చిపొమ్మంటావు ప్రియా

నీవెక్కడ.... నేనెక్కడ.....
కలలో అయీనా అనుకోలేదే ఎదురొస్తావని

ఆకాశంలో జాబిల్లి లా అక్కున చేర్చుకున్నావు
అవునా అని తిరిగి చూసేలోపు..

మబ్బులచాటుకు చేరుకున్నావు
విధి కాలంతో కలిసి ఒక్కటై మునుపెన్నడూ
ఎరుగని సంతోషాన్నీ భాధనీ నవ్వులనీ
ముప్పేటగా చేసి నన్ను ఊపిరాడనివ్వక
అనుక్షణం నీగూర్చి నా మదిని మెలిపెడుతూ
నిద్రని దూరం చేసి కళ్ళని కలవరపెడుతున్నది
నిజానికి ... అబద్ధానికి మధ్య ఉన్నది గోడలాంటి కల 

ఒకప్పుడు నిజం ఇప్పుడు నీడైంది
అది జ్ఞాపకమై కళ్ళలో కన్నీరై..

మదిని కలవర పెడుతూనే ఉంది
అదృస్యం అయ్యావు.. అని వెతికితే
ఎదురు పడ్డ ప్రతిసారి అవమానాల పాల్జేశావు
ఆరాటపడ్డాను .. 

ఎందుకిలా చేస్తున్నావని కంగారు పడ్డాను చివరకు ఏం చేయాలో తెలీక అలవాటు పడ్డాను...
నేను మనిషినే అన్న విషయం ఎలా మర్చావో తెలీదు అందరూ ఇలా చేస్తారా అంటే.. 
అప్పుడేదో చెప్పావు...నేనలా కాదు అని
అప్పుడు నీవన్నవన్నీ అబద్దాలని తెలీల
ఇప్పుడెందుకిలా చేస్తున్నావని 

అడలేనంత దూరంగా జారుకున్నావు
 హృదయం  ఉండ బట్టలేక 

నీకోసం తడుముకున్నా ప్రతిసారి
అవమానించావు.. కావాలని నీవు చేయమన్నావో
నీ అలుసు చూసుకొని వాళ్ళే చేశారో తెలీదు
వాళ్ళు చేసిన అవమానాలకు చచ్చిపోయాను ఎప్పుడో
ఇప్పుడు ఓ బ్రతికున్న శావన్ని..
మనిషి అన్నా  తియ్యటి మాటలన్నా.. 

అభిమానం అన్నా ప్రేమ అన్నా.. ఆప్యాయత అన్నా
భయం వేస్తు...నీవు కత్తులతో పొడిచినంత భాదేస్తుంది
"మొదట్లో ఇది పొరపాటుగా చేశావేమో 
అనుకున్నా ఆతర్వాత తెల్సింది 
నీకిది అలవాటుగా "..చేసుకున్నావని
మళ్ళీ ఎన్ని ఎదురు దాడులకు సిద్దం 

అవ్వాలో అని తలవంచాను.. తప్పక..
అదేనీకోరిక అని ఆలస్యింగా తెల్సుకున్నా ప్రియా