1) విషాదంలో సైతం పెదవులు నవ్వుతున్నాయి
తన జ్ఞాపకాలలో దూరమైన చెలిని తలపులలో పలుకరిస్తూ
2) చీకట్లన్ని నావి చేసుకున్నా వెలుగుల పరదాలని కోసం
మౌనంగా నిల్చుని వెన్నెలని చుస్తూ చిల్లులు పడ్డ ఆలోచనలలోంచి తొంగిచూస్తున్నా
3) రోదిస్తున్న కన్నీళ్లు నా ప్రేమ రంగులని చెరిపేస్తున్నాయి
తనకు తానే రూపం కోల్పొతుంటే చూడలేక నా కళ్లు కన్నీళ్ళతో నిండిపోయాయి
4) నేను గడిపే నాదైన కాలం ఎంత కఠినమైనదంటే
క్షణ క్షణం కాలనాగై నన్ను మాత్రమే కాటువేయాలని చూస్తుంది
5) నేను ఎక్కిన ప్రేమ భలిపీటం జాలిలేనిది
కాలికింద ఆసరా ఇస్తూనే తల తలారికిచ్చింది అచ్చం నీలానే ప్రియా
6) కలత సమయాన నా కన్నీరు లో నిలుస్తున్నావు
ఓటమి వేల గుండె పొరలో దుక్కాని గాయాన్ని కెలుకుతున్నావెందుకో
7) కరిగిన కలలు.విరిగిన ఆశల సౌధాల నడుమ
కదలిపోతున్న కాలం తేలియాడుతూ దూరంగా కొట్టుకుపోతున్న నా దేహం
8) గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు..
పొరపాటుగా చేస్తున్నావో అలవాటు గా చేస్తున్నావో అర్దంకావడం లేదు ప్రియా
9) నిన్నటి నీ పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్నేలే ప్రియా
10) పగిలినమనుసు నాదై ..మౌనం నీదైనప్పుడు
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు ఆశబ్దకూడా పగిలిపోయిందెందుకో
11) నా మనసు నిన్ను వీడనని
మొరాయిస్తుంది అది నీకు బానిసగామారి.....
12)నాలో ఉన్న నిన్ను నాలోనే వెతుకుతున్నాను
అలసిన నేను నీ ఊహల్లో సేదతీరుతున్నాను తప్పదుకదా
13) అనుకోని నిజాలు ఆకస్మికంగా వచ్చి వాలాయి
కలలో తేలి ఆడుతున్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
14) జ్ఞాపకం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది
మౌనంగా తనతో తానే నీకోసం ఆరాటపడుతుంది
15) నీకూ నాకూ మాత్రమే తెలిసిన మనదైన మరువలేని ఏకాంతం లోనూ నీ చుట్టూ నేను రాలేని అడ్డుగోడలు..ఆగోడలు కూల్చలేను దాటి రాలేను వద్దన్నావుగా
16) నీ పంతాన్ని నెగ్గించుకొని నాతో మటుకు మౌనం గానే వుండు
నీ మౌనమే గెలుస్తుందో నా ఊహలే జయిస్తాయో చూద్దాం...?
17) ఈ నిశ్శబ్దపు రాత్రిని అఘాదాల్లోకి కూరుకపోతున్నా
మరేవరికీ అందని దూర తీరాలకు జారిపోతున్నా ఇంక బైటికి రాలేనంతగా
18) ఆకాశ౦లో నల్లని మబ్బులు చల్లని గాలిని పదేపదే
ముద్దాడుతూ మెరుపుల నవ్వులను విసురుతున్నాయి ఎవరికోసమో...?
19) ఎప్పుడో చెప్పాను నువ్వు నాలోతైన మది గదిలో బందీవని
నా మది గది తలపుల తాళం..నీదగ్గరే ఉందా .. అవసరం లేదని పారేశావా ప్రియా
20) దీనమ్మ జీవితం ఎవడివిరా నీవు ఎదురొచ్చి మరీ
నా స్నేహాన్నీ నానుంచి దూరం చేశానని గేలిచేస్తూ వెటకారం చేస్తున్నావు
21) భాదపడాలంటే కారణంకావాలి..దానికి తోడు కన్నీరు కావాలి ..
కాని నాకు నీ పరిచయం చాలు జీవితాంతం ఏడ్వటానికి ప్రియా
22) ఒకప్పుడు నిజం ఇప్పుడు నీడైంది
అది జ్ఞాపకమై కళ్ళలో కన్నీరై.. కనుమరుగైన జ్ఞాపకమైంది
23) పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా అదృస్యంగా ఉన్ననీవు ఏదృస్యంలో కనిపించడంలేదు గా
24) నీవు నిజానికి నిప్పు పెట్టి చలికాసుకొంటూ మనసుతో ఆడే గేం అని తెలీదు
నాలో "ప్రేమ" అనే పెట్రోల్ మండించావు తగల బడుతున్న నన్ను చూసి నవ్వుతున్నావు
25) ప్రేమనుకున్నా...కాని అది బ్రమే అని
నీవు పగల బడి నవ్వకకాని అస్సలు నిజం తెలీలేదు