. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, June 24, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(6)

1)  నా ఆలోచనల్లో నా ఊహల్లో తనువంతా ఉన్న నిన్ను దాటి
ఏ మృత్యువు నన్ను దరిచేరలేదు అందుకే నాలో ఉన్న నన్ను నువ్వు తీసుకెళ్ళిపో

2)  చంపేసెయ్యి నా మనసుని నా ఆలోచనల్ని చంపేసి
నేను నాలో లేను నాలోనుంచి నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్ ప్రియా

3)  'జాబిలి' నిన్ను పంపించిందా
'జాజిపువ్వే" నీలా మారిపోయిందా అందాల చందమామ

4)   నా గొంతుకలో పొలమారినప్పుడల్లా పిచ్చిఅలోచన
నీవు నా కోసం నీవు ఎక్కడో అలోచిస్తున్నా వంటూ...?

5)  ఈ వలపుల దారిలో కనిపించని మెలికలేన్నో
తలపుల జల్లుల్లో మునిగిపోతున్నా కాస్త కాపాడవూ

6)  నువ్వు బాదగా ఉన్నపుడు నా కన్నీటిని పంపుతున్నా
నీ కన్నీటిని వేష్టు చేయకు...అవి చాలా విలువైనవి కదా

7)  ఎదలోతుల్లో బద్రంగా పదిలపర్చుకున్న జ్ఞాపకాలను కదుపుతున్నారు
ఎవ్వరో అర్దంకావడం లేదు అదేంటీ నీవా.. నాజ్ఞాపకాలను ఎందుకూ దోచుకెలుతున్నావు

8)  వర్షంలో ఉన్నా నా కళ్ళలో ఈ తడి ఏంటి
మనసెందుకో తడిగా ఉంది ఆ తడే కన్నులను చేరిందేమో ప్రియా

9)  నేను ఏకాంతంలో ఉన్నాను...అంతా నన్నే చూస్తున్నారు.
కానీ ఎందుకో ఎంత ప్రయత్నించినా నన్ను నేను చేరలేకపోతున్నాను

10)  వర్షంలో తడుముకుంటూ వెన్నెలలో వానలో
మన జ్ఞాపకాలను తడుముకొంటూ తడుచుకొంటూ వెలుతున్నా

11)  నీ కంటి పాపలో నన్ను చూసుకోవాలనీ
గుప్పెడంత నా గుండెలో నిన్ను దాచుకోవాలనీ ఏంటో పిచ్చి ఆలోచనలు

12)  ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా
అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది..అదినీవని తెల్సినా ఏంచేయను

13)  పరియయస్తున్ని అపరిచితుడవైన నిన్ను నాతోవిడదీసిన విధిని
ఇన్నేళ్ల దూరాన్ని ఇంకా దూరం చేసిన రహస్యమూ అందులోనే నిశ్శబ్దంగా నేను

14)  కరిగిన వెన్నెల కల లాంటి ప్రేమలో జారిపోయింది
మెలకువలోనుంచి నిదురకోసం ఎడతెరిపి లేని పోరాటమే

15)  గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు..
పొరపాటుగా చేస్తున్నావో అలవాటు గా చేస్తున్నావో అర్దంకావడం లేదు

16)  కాలమిలా విషం చిమ్ముకుంటూ పోతోంది
ఓర్వలేని ఒంటరితనం మనసుకు గాయాలు చేసుకుంటూపోతుంది

17)  జాబిలీ భామను రమ్మని పిలుస్తాను నవ్వుల వెన్నల కురిపిస్తావా
ఎన్ని అవమానాలైనా బరిస్తాను నీకోసం మరి నీ మౌనాన్ని వీడుతావా......చెప్పు ప్రియా

18)  ఇంత ఓదార్పుకు నోచుకోని తన స్నేహమే దిగిరాని...
నా ప్రాణము పోయినా ఓ మంచి స్నేహము లేని ఓ కుంటి జీవితముగా మిగిలిపోని. .

19)  విరహమెంత విసిగించినా..నిను వదలదు ఈ మనసు..
వలపు తోటలో విరహంతో ఎదురుచూస్తుంది..ఏప్పుడొస్తావంటూ

20)  ప్రియా నాలుగు నవ్వుల్ని దోసిట్లో పోసి నాకివ్వరాదు
వాటిని ముత్యాలుగా మార్చుకొని గుండెగదిలో జాగ్రత్తగా దాచుకొంటా

21)  చిరుజల్లులు మనసులో సందడి చేస్తున్నాయి
ఆకాశం వేసే తుంటరిజల్లుల్లో తడచి ముద్దౌతున్నా..

22)  మనసుని మాఉయ చేసి....భావాన్ని అక్షరాలుగా చేసి
నిన్ను మాత్రం తలచుకోవద్దంటే అక్షరాలు నా మనసుమీద దాడి చేస్తూన్నాయి

23)  ఓర్వలేని ఒంటరితనం చాటుగా పరుచుకునే దిగులు చూపులు
రోజుల ఎడబాటైనా వల్ల కాదంటూ రాలి పడే కన్నీటి బొట్లు..చప్పుడు నీకు వినిపిస్తుందా

24)  ఈ క్షణం మంచిది కాకపోతే...గడచిన క్షణం తో పొల్చి ఆవేదన
రాబోయే క్షణాన్ని తలచి..ఆశ నిరాశల ఆరాటం అలుపెరుగని ఆలోచనలు

25)  రెండు జతల కళ్ళూ రెప్పలేయడం మరిచిన ఆ క్షణంలో మగతగా కళ్ళు మూసుకొని నీ వెందుకు మునివేళ్ళపై నిలబడ్డావో నీ పెదవులకు తెలుసు నా మనసుకు తెలుసు

26)  కాలం కౌగిట్లో క్షణాలు కరిగిపోతుంటే
రాతిరి విడిపోయి వేకువలో..ఎర్రటి ఎండ గుచ్చుకుంటోంది నీకోపంలా

27)  కనులు మూస్తే కలలో కనిపిస్తూ...కనులు తెరిస్తే ఊహవై కవ్విస్తూ
హృదయపు తలుపులు తట్టి దొంగగా చొరబడ్డావు.. నాలో నన్ను లేకుండా చేశావు

28)  తడి కళ్ళల్లో తేలాడిన పదాలు రెప్ప మూసే సరికి
కాగితం పైకి ఉరికాయి..కాలిన మనసు గాయల సాక్షిగా

29)  వెండి వెన్నల చందమామ , నిండు పువ్వుల మల్లే తోట
నింగికేగిసిన నీటి మేఘాలు నేలకొరిగిన వాన చినుకులు వయ్యారి వలపుల వాన

30)  చీకటితో అల్లుకున్న రహదారుల వెంట తిరుగాడుతూ
ఏకాంతపు చందమామనూ అక్కడక్కడా ఆకాశంలో దిగబడ్డ చుక్కల్లా

31)  విషాదంలో సైతం పెదవులు నవ్వుతున్నాయి
తన జ్ఞాపకాలలో దూరమైన చెలిని తలపులలో పలుకరిస్తూ

32)  చీకట్లన్ని నావి చేసుకున్నా వెలుగుల పరదాలని కోసం
మౌనంగా నిల్చుని వెన్నెలని చుస్తూ చిల్లులు పడ్డ ఆలోచనలలోంచి తొంగిచూస్తున్నా

33)  రోదిస్తున్న కన్నీళ్లు నా ప్రేమ రంగులని చెరిపేస్తున్నాయి
తనకు తానే రూపం కోల్పొతుంటే చూడలేక నా కళ్లు కన్నీళ్ళతో నిండిపోయాయి

34)  నేను గడిపే నాదైన కాలం ఎంత కఠినమైనదంటే
క్షణ క్షణం కాలనాగై నన్ను మాత్రమే కాటువేయాలని చూస్తుంది

35)  నేను ఎక్కిన ప్రేమ భలిపీటం జాలిలేనిది
కాలికింద ఆసరా ఇస్తూనే తల తలారికిచ్చింది అచ్చం నీలానే ప్రియా

36)  కలత సమయాన నా కన్నీరు లో నిలుస్తున్నావు
ఓటమి వేల గుండె పొరలో దుక్కాని గాయాన్ని కెలుకుతున్నావెందుకో

37)  కరిగిన కలలు.విరిగిన ఆశల సౌధాల నడుమ
కదలిపోతున్న కాలం తేలియాడుతూ దూరంగా కొట్టుకుపోతున్న నా దేహం

38)  గాయం మానలేదనుకుంటే మరో గాయానికి గురి చేస్తున్నావు..
పొరపాటుగా చేస్తున్నావో అలవాటు గా చేస్తున్నావో అర్దంకావడం లేదు ప్రియా

39)  నిన్నటి నీ పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్నేలే ప్రియా

40) పగిలినమనుసు నాదై ..మౌనం నీదైనప్పుడు
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు ఆశబ్దకూడా పగిలిపోయిందెందుకో