. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, June 22, 2013

హైదరాబాద్ పంజాగుట్ట లొ పట్టపగలు మహిళ దారుణ హత్యి

నగరం నడిబొడ్డున పట్టపగలే ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పంజగుట్ట డివిజన్ పరిధిలోని నవీన్‌నగర్ కాలనీ విశ్వేశ్వర్లు అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో నివాసముండే అమీర్ మహ్మద్ జమాల్ హైటెక్ సిటీలోని ఐబీసాఫ్ట్ సంస్థ ఉద్యోగి. ఇతని భార్య షరీన్‌షిగోస్తా (28) గృహిణి. వీరికి హర్ష అనే మూడున్నరేళ్ల కుమార్తె ఉంది. హర్ష బంజారాహిల్స్‌లోని బచ్‌పన్ ప్లే స్కూల్‌ల్లో నర్సరీ చదువుతుంది. శుక్రవారం ఉదయం అమీర్ ఎప్పటిలాగానే విధులకు వెళ్లగా షరీన్ తన కూతుర్ని పాఠశాలకు పంపింది.

పాఠశాల నుంచి పాప వచ్చే సమయానికి (మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు) ప్రతి రోజూ అపార్ట్‌మెంట్ కింద ఎదురుచూసే షరీన్ శుక్రవారం రాకపోవడంతో అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ శేఖర్, పాపను మూడవ అంతస్తులోని వారి నివాసానికి తీసుకువెళ్లాడు. ఎంతసేపు బెల్ కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన శేఖర్, అమీర్‌కు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అమీర్ తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపు తెరిచి చూడగా బెడ్‌రూంలో షరీన్ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అమీర్‌పై అంతస్తులో ఉన్న ఇద్దరు వైద్యులు, వాచ్‌మన్ సహాయంతో కేర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో షరీన్‌ను ఎక్కించారు.

ఈ మేరకు ఎర్రమంజిల్ కాలనీలో నివాసం ఉండే షరీన్ సోదరుడు ఆసిఫ్‌కు అమీర్ సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆసిఫ్ తన సోదరిని చూసి వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న డీసీపీ సుధీర్‌బాబు, పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్య, ఇన్‌స్పెక్టర్లు తిరుపతిరావు, సత్తయ్యలు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌టీంను, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గల పూర్తికారణాలు తెలుసుకొని విచారణను వేగవంతం చేస్తామని డీసీపీ సుధీర్‌బాబు తెలిపారు.

హత్యపై పలు అనుమానాలు

ఈ ఘటనలో చాలాసేపు పెనుగులాట అనంతరం హత్య జరిగినట్లు పోలీసులు బావిస్తున్నారు. మృతదేహం గొంతుపై ఆరు కత్తిగాట్లు ఉండటమే కాకుండా కణత భాగంపై బలమైన గాయం కావడంతో ఆ భాగం వాచింది. కింది పెదవిపై బలమైన గాయం ఉంది. బెడ్‌రూంలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్‌రూంలోని కొన్ని బంగారు ఆభరణాలు, కొంత మేరకు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో ఇది దొంగల పనేనా అన్న అనుమానం కలుగుతుంది. అయితే హత్య అనంతరం ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లడం... హత్య జరిగిన ఎంతోసేపటికి గాని పోలీసులకు తెలపకపోవడం... శవాన్ని తరలించేందుకు ప్రయత్నించడం... తదితర అంశాలు చూస్తుంటే పలు అనుమానాలు కల్గుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసినవారు తాపీగా బాత్‌రూంలో కాళ్లు, చేతులు కడుక్కున్నట్లు బాత్‌రూంలో ఉన్న రక్తపు మరకల ద్వారా తెలుస్తుంది. పోలీసు జాగిలాలు హత్యజరిగిన ప్రాంతం నుంచి బాత్‌రూంకు, అక్కడి నుంచి తిరిగి సెల్లార్‌లోని అమీర్ కారు వద్దకు పోయి అక్కడి నుంచి తిరిగి బెడ్‌రూం వద్దకు చేరుకొని అనంతరం అమీర్ వద్దకు వచ్చి ఆగినట్లు పోలీసులు తెలిపారు.