1) పదాలను వెదికి పెదాల వెనుక దాచి
పలకరించాలని వున్నా అదృస్యంగా ఉన్ననీవు ఏదృస్యిం లో కనిపించడంలేదు గా
2) నీవు నిజానికి నిప్పు పెట్టి చలికాసుకొంటూ మనసుతో ఆడే గేం అని తెలీదు నాలో "ప్రేమ" అనే పెట్రోల్ మండించావు తగల బడుతున్న నన్ను చూసి నవ్వుతున్నావు
3) ప్రేమనుకున్నా...కాని అది బ్రమే అని..
నీవు పగల బడి నవ్వకకాని అస్సలు నిజం తెలీలేదు
4) మొదట్లో ఇది పొరపాటుగా చేశావేమో అనుకున్నా
ఆతర్వాత తెల్సింది నన్ను అవమానించడం నీకు అలవాటుగా మార్చుకున్నావని
5) ఎందుకిలా చేస్తున్నావని కంగారు పడ్డాను చివరకు ఏం చేయాలో తెలీక అలవాటు పడ్డాను
6) ఆకాశంలో జాబిల్లి లా అక్కున చేర్చుకున్నావు
అవునా అని తిరిగి చూసేలోపు..మబ్బులచాటుకు చేరుకున్నావు
7) నీ ఊహల చిక్కుముడులు విప్పాలని చూశా
జ్ఞాపకాలు గుచ్చుకుని రక్తం వస్తోంది నీ ఆనందంలాగా
8) నీకు నా ఆలోచనలు వింతగా వుంటే నా ఊహలని ముక్కలు చేసేయి
ఇప్పటికే నీవు రెక్కలు విరిచిన పక్షిని...ఏగరాలని నీవద్దకు రావాలని ఉన్నా రాలేనులే
9) కన్నీరు తాకిన చేతులు తడి ఆరలేదింక
ఆ తడి చాటున కధ తీరలేదింక.. మళ్ళీ ఏడిపించడానికి సిద్దం అయ్యావా ప్రియా
10) ఓ ప్రేమ ఎంత దూరంగా వున్నా విరహముతో దిగులును మెప్పించగలను
11) విరహమెంత విసిగించినా నిను వదలదు ఈ మనసు..
వలపు తోటలో పువ్వులా ఉన్న నిన్ను ఆక్రమించి ఆస్వాదించాలనే ఆరాట పడుతున్నా
12) రాత్రుల్లు కలలోనే కనిపించి కలవరపేడుతున్నావు
నిన్ను చూడాలని కనులు తెరిచేలోపు..కనుమరుగైపోతున్నావు
13) మాటలతో చెలిమి దూరం అయినప్పుడు..మనసును ఆవిష్కరించే కుంచె కవిత కదా
నా కవిత నీ కోసమే పుట్టింది తెలుసా..అన్నీ తెల్సు కాని ఏంతెలియనట్టు దూరంగా ఉన్నావు
14) కంట్లో పొడిచి కనిపించకుండా ఆదృస్యం అయ్యా అనుకుంటూన్నావు
మరి గుండెళ్ళో ఉన్నావు అక్కనుంచి పోవాలంటే గుండెను కూడా ఆపేయి మరి
15) ఎప్పటికీ నాతో నడవని నీకోసం ఇక్కడే ఆగిపోతానంటున్న గుండె వంక చూసి తెలుసుకున్నాను నీ వద్ద నేను చెప్పుకునేందుకు నా జ్ఞాపకాలు నీ వద్దలేవని మిగిలి లేవని
16) మనసువిప్పి మాట్లాడాలి అనుకున్న క్షణం..
నిశ్శబ్దం నీడగా, ఏకాంతం ఊపిరిగా నా గొంతులో గుచ్చుకున్న నీజ్ఞాపకాల చురకత్తులు
17) ప్రతి నీటి చుక్కలో ఓ హృదయం దాగి ఉంటుంది
ప్రతి కనుపాప వెనుక మనల్ని వెంబడించే ..ప్రేమించే మనుషులుంటారు
18) దు:క్కానికి అతీతమైనది "కన్నీటి భాష" అది నేర్పింది నీవేగా ప్రియా..
19) నీ జ్ఞాపకాలే ప్రపంచామనుకునేల చేస్తావు..నన్ను నాలో లేకుండా చేస్తావు రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు
20) రాత్రులు కరిగిపోతాయి..పగలు గడిచిపోతాయి
కాని నీ జ్ఞాపకాలు మాత్రం నాలో అలాగే మిగిలి పోయాయి
21 ) మరణ శయ్యపై పడుకో బెట్టిందే నీవు
అయ్యో పాపం అంటూ ఏడ్చేదీ నీవే ..నీకేదైనా సాద్యమే ఫ్రియ.
22 ) నిశ్శబ్దంగా దొంగలా నాలో చేరుకుంటావు..
వర్తమానపు ఒంపుల మీదుగా జారిపోవాలని చూస్తావెందుకో..?
23) నా గుండె గుడిలో జ్ఞాపకాల దీపాలు ఆర్పాలని చూశావు
కాని జ్ఞాపకాల వేడి ఆవెలుగులను ఏంచేయ అలేకపోయావు
24) అందర్లో నన్ను ఎక్కువగా అభిమానించే నీవు..
"అవమానించడం" అలవాటు చేసుకున్నావెందుకో ప్రియా
25) కన్నీరు నీవి అయితే "కన్నులు" నావి కావలి
గుండె నిది అయితే "చప్పుడు" నాది కావాలి
నీ శ్వాస ఆగితే "మరణం" నాది కావలి .
26) కారణం లేకుండా కోపమొస్తుంది.. కారణం లేకుండా భాదేస్తుంది
అందుకే నా ఎదురుచూపుల్ని మౌనంలో చుట్టేసి దుప్పట్లో కప్పేసి రోదిస్తాను
27) నీ కాలికింద నలిగిన నా జ్ఞాపకాల నిర్లిప్తత
రాత్రంతా మనస్సులో గుచ్చుకుంటూ..ఉదయానికి గాయం అయింది
28) ఎవ్వరూ లేని ఏకాంతంలో.. చీకటిని చీల్చుకొని వెలుగురేఖలు
ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి ..బదులియ్యలేని భారమైన సమాదానంలా
29) నీవ్వున్నది నా కోసం...నేనున్నది నీ కోసం
30) మనం గడిపిన రోజులు కొన్నే అయినా
నీవు నాకు మిగిల్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో
31) ఊహాల రెక్కలు కోసేసుకుని...మార్పు అనే తూర్పు వైపు చూడకుండా ఎన్నాళ్ళీలా....?
32 ) ఒంటరితనంలో ఇమడలేక ఆవహించిన ఏకాంతపు మౌనంతో బ్రతకలేక
నాలో నేను నిశ్శబ్దపు యుద్ధం చేయ్యలేక పడుతున్న వేదన నీకు అర్దం కాదేమో ప్రియా
33) చెదిరిన స్వప్నాలను కన్నీటి బాష్పాలుగా మారుస్తూ ఎదబీడుని తడుపుతున్నాను
34) కన్నీరు తాను దూరమైపోతే ఏమౌతుందో అనే కలతతో వెంటనే....
రెప్పల అంచు నుండి కంటిలోనికి జారి ఇనికిపోయింది నీకేదో చెప్పాలనే తొందరలో
35) అంబరాన అలరారే అందమైన 'జాబిలి'ని చేరుకోలేను
నీవు నా గుండెలో చేసిన తీపి గాయాల గురుతులను చెరుపుకోలేను..
36) కాస్త ఆలస్యమైందేమో చీకటి చుక్కల్నివెలుగు దుప్పటి కింద
దాచేయడానికి హడావిడి పడుతున్నయి మబ్బులు... నాకు "జాబిలి " కనిపించకుండా చేయ్యాలని
37) నిర్లిప్తత మనసుకు మెత్తగానీ జ్ఞాపకాలు చేస్తున్న గాయాలు
గుండె పట్టక నిండుతున్న కన్నీళ్ళు వర్షంగా కురిసినిన్ను తడిపేందుకు సిద్దంగా ఉన్నాయి
38) నవ్వుల చిరుజల్లులను జాబిలి దోసిలి నించి జారవిడిచింది..
చిలిపి జల్లులు మనసును దోచి..ఆ జల్లుల్లో చల్లగా తడిపేస్తున్నాయి
39) "వెన్నెల" స్నానం చేసిన నల్లటి మబ్బుల తివాచీ మీద నడస్తూ
తడి ఆరని నీ కురులనుంచి జారిన నీటి చుక్కలే ఈ చిరుజళ్ళులేమో ప్రియా
40) ఎన్నో ఊసులను తనలో దాచుకున్న నా మనసు నీ చిన్ని ఎడబాటుతో ఒంటరిగా మారింది.
గుండెను పిండే ఈ భారాన్ని నేనొక్కడినే మోస్తున్న కూలబడ్ద ప్రతీసారీ నీ చిరునవ్వుల జ్ఞాపకాలతో
41) అప్పుడు " ప్రేమ రాపిడి "అన్నావు మరిప్పుడు ఏమైంది..మనిషిమారాడా...? మాట మారిందా..?
42) మనిషి కనుమరుగై ..."బాగున్నావా"
అనే మాట కూడా ఎంత భారం అయిందో
43 ) నీ మాటల్లో తూటాలు పెట్టుకొని
అవమానాలనే గన్ లతో పేల్చాలనే చూస్తున్నావెందుకు
44) నా గుండెని తెరిచి చూడాలని చూడకు ..
అన్ని త్రుప్పు పట్టిన జ్ఞాపకాలతో అవమానాల రక్తపు మరకలే కనిపిస్తాయి
45) ఓ "ప్రేమ" నీకు విలువలేదా అలా పంచుకుంటూ పోతున్నావు
అది అందుకున్నోళ్ళు నీవో టైంపాస్ కన్నేగా చూస్తున్నారు జాగ్రత్త