ఓకవి తన అంతరంగాన్ని కవిత్వంరూపంలో చెప్పే క్రమంలో ఎంత మానసిక ఒత్తిడిగి గురి అవుతాడో..గుండెగదిలోని భావాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నప్పుడు పడే ప్రసవవేదన చెప్పతరంకాదు..కవిత్వరూపం దాల్చి నప్పుడు .. మరొకరు బాగుంది అని పొగిడినప్పుడు ..ఆ కవితను ఆకవి అప్పుడే పుట్టీన బిడ్డను చూసుకున్నట్టు మురిపంగా చూసుకొని మురిసిపోతాడొ కదా...రాయాలనుకున్న మాటలు రాళ్ళుగా మారి గుండెపై దాడి చేసినప్పుడు...ప్రేమ అనే పదం తనంతటతాను అర్దాలు మార్చు కొని ఊసర వెళ్ళై అయి మనసును వెక్కిరిస్తున్న క్షనంలో ..విరహ వేదనతో రాయాలనుకున్న పదాలు నిలకడలేక.. ఏన్నో ప్రశ్నల్లో నన్ను నిలదీస్తున్నప్పుడు..నిజాన్ని అబద్దంగా మార్చలేక.. మనసును ఏమార్చలేక..ఎదురు చూసిన క్షనాలు ఎవరు నీవని ప్రశ్నించిన క్షనాల్లొకాగితం మీద రాసిన అక్షరాలు గుండెపగిలి కారుతున్న రక్తపు బొట్లైతే ... కవిత సువాసనల బదులు వైరాగ్యింతో నిండీన న పదాలు ప్రబందకాలై ఏన్నో చెప్పాలనున్నా చెప్పాలనుకున్న విషయం తప్ప ఏదేదో చెప్పేస్తుంటే అక్షరాలు అనుకున్నట్టూ ఎలా నిలుస్తాయి..