. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 27, 2013

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(7)

1) చిగురుటాకుపై మెరిసే చిన్ని 
మంచు బిందువుని చూసి నీవనుకున్నా
చందమామ లో విరిసే వెన్నెల పువ్వుల్ని 

కోసి అవన్నీ నీకిద్దమనుకునే లోపు నీవులేవు

2) నీ చూపుల చీకట్లు 
దాటి ఊహల ఉయ్యాలలూగి 
ఎన్నాలైయింది నా అంతరాంతరాల్లో 
ఓటమి ఒదిగి ఒదిగి చూస్తుంది..ఒక్కసారిగా నన్ను కబలించాలని

3) మనిద్దరి మాటలకు 
మంటలు పెట్టి తగలెట్టావు ఆ మటల్లో 
మరొకరికి స్నేహాన్ని పంచి అదే పండు వెన్నెల అంటున్నావు

3)  ఇద్దరికి మధ్య తెలీని పూడ్చలేని అఘాదం నువ్వు తవ్విన గుంతలో నేను..ఒడ్డు పైన విరగబడి నవ్వుతూ నీవునెల అంటున్నావా ప్రియా
 
4) నిన్ను నీలొ కోల్పొయావు..అప్పటి నీవు కాదిప్పుడు
నువ్వు నీలా ఉన్నావా అలా లేవు కదూ.. నా కన్నీటి జలకాల్లో కరిగిపోయిన గుర్తులేవి


5) రాత్రి పెచ్చులు పెచ్చులుగా రాలిపోతుంది
ఆ పైచ్చులు నన్ను కబలించి వేస్తున్నాయ్
తిరిగి లేవాలని లేదు.. మళ్ళి మరోరాత్రిని చూడాలని లేదు..
ఎందుకో తెల్సా మళ్ళీ ఎదురుపడి ఎక్కడ నన్ను అవమానించి భాదపెడతావో అని
 
 


6) మనసు భాదగా ఉన్నప్పుడు 
విషాదాన్ని గ్లాసులో పోసుకునే తాగితే ఎంచక్కా ఏడ్వొచ్చు కదా

7) ఏంటా రక్తం వస్తోంది అనుకున్నా
 నీ పదునైన మాటలు గుండెళ్ళో గుచ్చుకున్నాయి 
కదూ దానితాలూక రక్తపుచుక్కలే ఈ పదాలు

8) ఎందుకు అలా రాళ్ళమీద నడుచుకొంటూ వెలతావు
నాజ్ఞాపకాలెన్నో ఉన్నాయిగా వాటిని చెప్పులుగా చేసుకో నీ పాదాలకు ఎలాంటి గాయంకాదు


9) ఎందుకలా చూస్తావు...నీవు వద్దనుకున్న గుండేగా
అందుకే నాగుండెగదులు నేనే కూల్చుకుంటున్నా...నీకోరిక అదేగా..?


11) నా జీవితాన్ని వర్షాపు బురదలో పారబోసాను నీ ఇంటిముందు
నీవు తొక్కుకుంటూ వెలతావు అని అయినా నీకిది అలవాటే కదా కొత్తేముంది..?


12) నా ఊహాల్ని నీ మౌనం ధ్వంసం చేస్తుంది నాప్రమేయం లేకుండానే
నీ జ్ఞాపకం కన్న కలల్ని సమూలంగా ముక్కలు చేస్తుంది జాలి అనేది లేకుండానే


13) నీవు కూడా నాలాగే నిజాన్ని దాస్తున్నావు
వర్షించే మేఘాలు చెబుతున్నాయి నీ వేదనని నాలా నీవేం చేస్తున్నావో


14) జ్ఞాపకాలు చేదయ్యాక నీకు తీపి గురుతుగా మిగిలి పోతానేమో
ఆత్మా దేహాన్ని వదిలే పయనంలో నిరూపితమవుతూ నిత్యం నిలిచి వుండేది ఒంటరితనం


15) పోగొట్టుకున్న నీ జ్ఞాపకాలు 
వెతికి పెడుతూ నా జ్ఞాపకాలు చేదయ్యాక 
తానో తీపి గురుతుగా మిగిలిపోతూ నేనొంటారిగా

16) ద్వీతీయతకు తావు లేని అద్వితీయ అద్వైతం.
నీడను సైతం తిరస్కరించే నిరంకుశ తత్వం ఆత్మావలోకనమే నా లోకం


17) ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం
తనలోకి లాక్కుంటుంది ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో మనసంతా ఇరుకుచేస్తుంది


18) ఓర్వలేని ఒంటరితనం చాటుగా పరుచుకునే దిగులు చూపులు
రోజుల ఎడబాటైనా వల్ల కాదంటూ రాలి పడే విలువలేని నా కన్నీటి బొట్లు


19) విచ్చుకోని పెదవుల మౌనంలో మనసు విరహ గీతాలు
చెమ్మగిల్లిన చూపుల కటూ ఇటూ వేల గా మిగిలిపోయిన జ్ఞాపకాలు


20) తపించే వెర్రి హృదయపు బెంగ బాధగా భారంగా మారినపుడు..
నవ్వులు పూయని శూన్యంలో..వెలుతురు సోకని లోకంలో నేనొంటరిగా


21) సుతిమెత్తని నీమందలింపులు ఏమయ్యాయో
నిర్లిప్తంగా రోజులెందుకు ఇలా ఒంటరిగా ఎందుకు మారాయో కదా


22) భరించలేని భాదవచ్చినా...తట్టుకోలేని సంతోషం వచ్చినా
కన్నీటి ఉప్పెనలో నీవే గుర్తొస్తావెందుకో..నీజ్ఞాపకాలే తట్టి నిన్ను గుర్తుచేస్తాయి


23) ఓ రోజు షడన్ గా నీవడిగిన ప్రశ్న
నీవెవరు అని నాకు ఇప్పటికీ సమాదానం దొరకలే నేను ఎవర్ని..?


24) నీ కురులు కరిమబ్బులై..కవ్విస్తున్న కావ్యింలా
నీ ఎదలయలు జడివానలై..నా కవ్వింపుల జల్లులై పడుతున్నాయి


25) విరహవేదనలో వచ్చిన నీ చెమట బిందువులే
ఇప్పుడు వానచినుకులై నన్ను తాకి పలుకరిస్తున్నాయేమో ప్రియా


26) ఈ సందేళ మంచు దీపాన్నై..నా మదిని మండించి
నీకు వెండి వెలుగుల హారతిస్తున్నాను చంద్ర కిరణమై నిన్ను స్పృశిస్తున్నాను


27) “ప్రేమ ఒక జ్వాల విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి అనంత దుఖాన్ని మిగిల్చేదీ ప్రేమే”


28) చిరుమువ్వకు అలసట లేదు..చిరునవ్వుకు అలజడి లేదు నిజమైన ప్రేమకు అంతం లేదు

29) అనంతాకాశంలో పున్నమి వెన్నెల్లా వెలుగుతు చిందిస్తూ
ఈ రాత్రి నా ఒంటరి ఊహల్లో నీ సుందరమైన రూపం నిలచి నన్ను ఊరిస్తోంది


30) నీ తలపు తన్మయమై నీ వలపు వెన్నెలై
వినిపించని నీ పిలుపు వేణుగానమైనా గుండెల్లో గంటలుగా పలుకుతోంది


31) నీ విచ్చిన సంతోషం
మనమద్యి చేరిన మౌనం ఆఆనందాన్ని ఆవిరి చేసింది


32 ) "నిద్రను" రాత్రి గ్లాసులొ పోసుకున్నా
నీ జ్ఞాపకాల తాకిడికి..ఎందుకో అది నిలవకుండా ఆవిరైంది


33) కలలు కాగితాల్లోకి జారిపోతున్నాయి
అక్షరాలపై ఎందుకో ఎర్రటి రక్తపు చారికలు కనిపిస్తున్నాయి


34) మాటలు కరువైతే మౌనం వెక్కిరిస్తుంది
మదిలో భావాలు క్యాన్సర్ గడ్డగామారి భాదపెడుతూనే ఉంటాయి


35) అవమానం ఎదురైతే అభిమానం మిగలదు.
స్నేహమే అవమానిస్తే మాటలు మౌనం దాలుస్తాయి


36) శ్రావణ మేఘాలను చీల్చుకుంటూ
చినుకుల వాన మొదలై మదిలో పులకింతలు రేపుతున్నాయి


37) నిముషం అయినా విడువలేని బంధాన్ని
శాసించడానికి టన్నుల కాంతి సంవత్సరాల కొలది షరతులా ?


38) ఇన్నాళ్లూ ఎగసి ఎగసి అలసింది ఆకాశాన్ని అందుకోలేక కాదు అక్కడ నువ్వు లేవని...

39) కనిపించకుండా వెల్లిన నీవు కనిపించాలంటే
నాకు నేను తగలబడీతేగాని ఆవెలుగులకోసమైనా కనిపిస్తావేమో కదా


40) అక్షరాల బరువుతో అలసిన పుస్తకానికి...
నాగుండెను ఆసరాచేశాను నీజ్ఞాపకాలే తోడుగా..
కనిపించకుండా పోయిన నీమనస్సాక్షిని వెతుకుతూ

41 ) నీ జ్ఞ్జాపకాల రాపిడికి గుండె వేడెక్కింది....
ఎక్కడినుంచో జివ్వుమని చిరు జళ్ళు నన్ను తాకింది అదినీవే కదా అవునని చెప్పవూ


42 ) చల్లని చిరుగాలి జివ్వుమని తాకినప్పుడల్లా నీవు పిల్చినట్టు అనిపిస్తోంది ఎందుకో

43) నీజ్ఞాపకాలు గుండెను తట్టినప్పుడల్లా
అవి తలదించుకుని తప్పుకుంటున్న ఈ ఘడియలకేమైనా తెలుసా


44) చిరుజల్లులు స్పర్శిస్తుంటే ఎవరో నన్ను ఆప్యాయంగా తడినట్టుంది అది నీవేనా ప్రియా

45) అనుభవాల అల్మరా 
తెరుచుకున్నప్పుడల్లా అన్నిటిలో నీవై వుంటావెందుకు

46) నీ జాడ లేని ప్రపంచంలో బ్రతకడం 
సాధ్యసాద్యిం కాదు కానీ సులభం మాత్రం కాదు

47) అస్పష్ట సందేహమేదో ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి వెచ్చగా హత్తుకుంది..

ఉదయపు వేకువ కిరనాళ్ళా

48) ప్రతిచినుకులో నీపలుకులే వినిపిస్తున్నాయి
చినుకుల శబ్దాలు పలుకులై నా మదిని చేరుతున్నాయి లే


49) నింగి విడిచి నిండు పున్నమి జాబిలమ్మ వచ్చేసింది
నా ఎదుట నిలిచే పున్నమి వెన్నెలమ్మ చిందే వెలుగులు నాకోసమే కదా


50) నా ఆలోచనల్లో నా ఊహల్లో తనువంతా ఉన్న నిన్ను దాటి
ఏ మృత్యువు నన్ను దరిచేరలేదు అందుకే నాలో ఉన్న నన్ను నువ్వు తీసుకెళ్ళిపో