. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 31, 2011

కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో..కలకాలమైతే బాగుండనిపించేంతగా





నీ కలలే నా జీవితం !!
నీ తలపుల వాకిట కునుకు తీసా!
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే

నిరాశతో గృహము చేరా
నిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు చిత్రపటంలో
నా రాకకై ఎదురుచూస్తూ

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

’ఎడబాటు’ నిర్వచన౦ సరిగా తెలియదు...కానీ.., నన్ను విడిచి వెళ్ళావు




ప్రియా..!
’స్ప౦దన’ నిర్వచన౦
...తెలియదు...
కానీ.., నిన్ను చూసిన తొలిక్షణమే
స్ప౦ది౦చాను
’ప్రేమ’ నిర్వచన౦
తెలియదు...
ఆ మరుక్షణమే
ప్రేమి౦చాను
’ప్రాణ౦’ నిర్వచన౦
తెలియదు...
అయినా నువ్వే నా ప్రాణ౦
అనుకొన్నాను
’ఎడబాటు’ నిర్వచన౦
సరిగా తెలియదు...
కానీ.., నన్ను విడిచి వెళ్ళావు
వెళ్ళేము౦దు
’జీవచ్ఛవ౦’ అనే పదానికి
నిర్వచన౦ చెప్పడ౦ మరచావు!

Saturday, July 30, 2011

వద్దు మనుషుల రిలేషన్స్ అన్నీ....నిజాలు కాదు అన్నీ అబద్దాలే




ఆవేదననుంచి పుట్టిన ఆక్రోసం...అలల్లా మనసుని తట్టిలేపుతూ నిజంకాని నిజంలా ఊరించి ఉడికించి అదృస్యింఅయితే..వచ్చేవి నిజాలేనా..అంటే ఏంచెప్పాలి...చెప్పుకోలేని మనసుభాద ,మనసును బంక మట్టిలా చేరి నిజాన్ని కప్పేస్తుంటే...నటించి నాటకాలాడేవారిని నమ్ముతుంటే... లోకం నిజాన్ని నమ్మటం మర్చిపోయినప్పుడు.....మనసాక్షిని చంపుకొని బ్రతకడంలో..నీతి, నిజాయితి సమాదిని చేసి సంతోషంగా ఉన్నానని చెప్పుకున్నా నీలో నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే నిజాన్ని నిర్బయంగా ఒప్పుకుటానని డాంబికంగా చెప్పుకోవడం కాదు...రాతల్లో కాదు చేతల్లో ఉండాలి...నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని , ప్రేమ,స్నేహం అంటూ ఎందుకు వెపర్లాడటం..నటించే వాళ్ళనే నమ్ము వాస్తవం తెలుసుకునే రోజొస్తుంది...అప్పుడు వెనక్కు తిగిరిగి చూస్తే అంతా సూన్యిం ఉంటుంది అప్పుడు ఏది కోల్పోతున్నావో తెలుస్తుంది...ఏది కొల్ఫోయావో అంటూ గతం నిన్ను వెక్కిరిస్తుంది ఇది వాస్తవం..కలల్లోనే కల్లోల పెడుతుంటే మీరిలా అయితే నిజం మనుషులే కళ్ళోల పెట్టి కళ్ళముందే తిరుగుతుంటే నిజాన్ని నమ్మాలా ...ఈ నిజం అబద్దం ఎందుకు కాకూడదూ అని..మనసును సర్ది చెప్పుకున్నా..నిజం అబద్దంగా మారదు...వాస్తవం అప్పటికప్పుడు అవాస్తంకాదు...కాని కొన్నిటికి కారణాలు చెప్పలేం..చెప్పుకోలేం అయినా ఇంత మనస్సులేకుండా ఎలా ఉండగలుగుతున్నారన్నదే అసలైన అర్దంకాని వాస్తవం..నిజమే నీడలామారి దూరం అవుతుంటే ....కలల్లో జరిగేది వాస్తంఅని సంతోషపడాలా...ఎందుకు బాబు జరిగేవి చూస్తుంటేనే మనుష్యుల్లో వస్తున్న మార్పులు ...మనసులోని ఊహలు కలల్లా వచ్చి కన్నీళ్ళే మిగులుస్తాయి అనే నిజాన్ని ఎప్పుడు తెల్సుకుటారో ఏమో నిజాలే నీడలౌతుంటే లేని వాటిని ఊహల్లో నిజమనుకోవడం పిచ్చే...వద్దు మనుషుల రిలేషన్స్ అన్నీ....నిజాలు కాదు అన్నీ అబద్దాలే నిజాలుగా కనిపించే...నీటి బుడగ అది ఎప్పుడు పగులుతుందో తెలీదు...రంగుల ప్రపంచాన్ని చూపించి అదే నిజమనిపించేలా చేస్తుంది...ఆ రంగుల బుడగ పగిలినప్పుడు అసలు వాస్తవం తెలుస్తుంది..అది అంతా నిజం కాదని బ్రమేనని ...నిజం కాదు నటన అని....జరిగిన జరుగుతున్న అసలు నిజాలు తట్టుకోలేక అప్పటికే గుండె పగిపోతుంది

మనసుని ముక్కలు చేసే ఈ మౌనాన్ని నేభరించలేకపోతున్నాను




చంపేసెయ్యి నా మనసుని నా ఆలోచనల్ని చంపేసి

నిన్ను నువ్వు తీసుకెళ్ళిపో నిన్ను నువ్వు తీసుకెళ్ళిపో

నాలో నరనరానా నిండిపోయిన నిన్ను నువ్వు తీసుకెళ్ళిపో

మనసుని ముక్కలు చేసే ఈ మౌనాన్ని నేభరించలేకపోతున్నాను

ఈ మనోవేదనని తట్టుకునే శక్తి నాకు ఉండటం లేదు

నీ కోసం కార్చిన కన్నీరు కూడా నన్ను గేలి చేస్తుంటే

సమాధానం చెప్పలేక నన్ను కూడా చంపేయమని ఆడగాలని ఉంది కాని

నా ఆలోచనల్లో నా ఊహల్లో తనువంతా ఉన్న నిన్ను దాటి

ఏ మృత్యువు నను దరిచేరలేదు అందుకే నాలో ఉన్న నిన్ను నువ్వు తీసుకెళ్ళిపో

అప్పుడు నాలో నువ్వులేని నేను ఉన్నా చచ్చిపోయినట్లే

ప్రాణం ఉన్న జీవశ్చవాన్నే . . . . JayA Reddy

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో




ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని

ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి

ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో

ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

నన్ను దహించివేస్తున్నాయని

ఎవ్వరికి తెలియియదు నన్ను నాకు కాకుండ చేసిన నువ్వంటే ఎంత అభిమానమో

కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు . . . . . . JayA

ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది..గుండెలోని నీ గురుతుల్ని శాశ్వతంగా చెరిపేసేది





నీ అల్లరి మాటలు...
అమాయకమైన నీ చూపులు...
నిత్యం నీ పెదాలపై చిందులేసే ఆ చిరునవ్వులు
నా గుండే చప్పుడై
ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటే....
...ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది...
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

నీతో అప్యాయంగా గడిపిన ఆ మధురక్షణాలు
నీతో అల్లరిగాపడ్డ ఆ గొడవలు..
ప్రతిసారీ నీ అలకలు...ఆ నీ ముతి ముడుపులు...
అనుక్షణం నా నీడల్లే వెంటాడుతుంటే
నిముషమైనా నిలువ లేక పోతున్నా ....
నిను తలువ కుండా...
కలలోను కలవరపెడుతుంటే...
కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...
లోలోపలే సమాధి చేసుకున్న
నీ జ్ఞాపకాలను తడుముతూ
మరువాలని ప్రయత్నిస్తున్న నాకు...
మళ్ళి మళ్ళి గుర్తుచేస్తుంటే..
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది,
గుండెలోని నీ గురుతుల్ని శాశ్వతంగా చెరిపేసేది....
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

Friday, July 29, 2011

చెపితే నువ్వు నమ్ముతావో నవ్వేసి పోతావో..




చిరుగాలి స్పర్శే లేక .
చివురాకు కమిలిపోయే .
చందనాల పరిమళాలు మోసుకోస్తావో లేదో .

మనసైన గీతం వినక .
మాపటికి వెలుగే రాదే .
జాబిలింక చిచ్చుబుడ్డై నవ్వుతుందో లేదో .

కలలన్ని నిజమవ్వక .
కునుకన్నది రానే రాదే.
నీ కళ్ళ వాకిళ్ళు తెరిచేది ఎన్నడో .

తలనిమిరే తపనే తీరక
కురులన్ని చెదిరిపోయే
నీ ముని వెళ్ళు నాట్యాలు నేర్చాయో లేదో.

తడి తీరని ఆశలన్ని .
తుడిచేసి పోవటానికి .
తువ్వాలై నీ తోడు దొరికేది ఎప్పుడో .

నడకలనే మరిచిన గుండె
గంతులనే నేర్చిందని
చెపితే నువ్వు నమ్ముతావో నవ్వేసి పోతావో..

నా కన్నీటి చుక్కలు ఏరులై పారుతూ వెతికేస్తున్నాయి..





ప్రియా!!.....
నీవు మిగిల్చిన శూన్యం అనే నా ఈ ప్రపంచంలో,
మన జ్ఞాపకాల దొంతర తీసి నీ చిరునవ్వులు వినిపిస్తాఏమో అని చూస్తే...
నా హ్రుదయ రోదనలు మాత్రమే వినిపిస్తున్నాయి....

నీ ఆనందభాష్పాల గురుతులకోసం ... ఆబగా
నా కన్నీటి చుక్కలు ఏరులై పారుతూ వెతికేస్తున్నాయి..

ఏమీ అగుపడక.. ఆగిపొతాను అని మొరపెడుతున్న నా హ్రుదయ ఆక్రందన నీకు వినిపించడం లేదా!

కరిగిన కలలు..
విరిగిన ఆశల సౌధాల నడుమ..
కదలిపోతున్న కాలం అనే కడలి అలలపై తేలియాడుతూ నీకు దూరంగా కొట్టుకుపోతున్న నా దేహం,
నీ తలపుల ఝడివానలో తల్లడిల్లుతున్న నా హృదయపు గవాక్షాన్ని తట్టి జో కొడుతూ అంటుంది..

" నీ ప్రేమకు ఫలం ఇదేరా !!! " అని...

Thursday, July 28, 2011

కన్నీరంటే 1% నీరు 99% ఫీలింగ్స్..కదా...?




కన్నీరంటే 1% నీరు 99% ఫీలింగ్స్..కదా...?
మనిషి జీవితంలో కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేది కన్నీరు..
ఎవ్వరు మోసంచేసినా గంతం గుర్తుకొస్తే తానున్నానంటూ పలుకరించేది కన్నీరు...
ఆనందమైనా ,భాదైనా తట్టుకోలేనిది గాఉన్నప్పుడు వచ్చేదే కన్నీరు..
కొందరు గుండెళ్ళో..చెప్పుకోలేని భాదను మిగిల్చి పోతారు..అప్పుడూ తోడుగా నిలిచేది కన్నీరు
కొందరు గుండెల్లో మిగిల్చిన గాయాలకు మందు కన్నీరే..
గతం గుర్తుకొస్తే..ఆ గతంతాలూక జ్ఞాపలకు గుర్తే ఈ కన్నీరు
మనసు కోల్పోయిన మనుషులు పెట్టిన గాయాలకు మందు కన్నీరే..
ఓ మనసా నీవు గుండెలమీద తన్ని వెళ్ళీనా నీవదిలిన జ్ఞాపకం ఈ కన్నీరు
నీకోసం కలల్లో తెలిపోతున్న నాకు కళ్ళలుమిగిల్చి నా నుంచి దూరం అయినా ..దానికి ప్రతిరూపం ఈ కన్నీరు
నీవంటూ నాకు దూరం అయి నీ ఆనందాన్ని వెతుక్కుంటూ పోయి నాకు మిగిల్చింది నీవు ఆ కన్నీరే..
నీవు నామనస్సులోఉన్నా నన్ను విడిచి వెళ్ళీన మధురమైన జ్ఞాపకమే కన్నీరు..
ఇలా నీవు దారుణంగా మాట్లాడి నప్పుడూ నాకు తోడు నిలచింది ఈ కన్నీరే...
నీవు నీ సుఖం చూసుకొని వెళ్ళినా ..నీజ్ఞాపకాలను తట్టీ లేపేదే ఈ కన్నీరు..
అసలు నీవు కన్నీరే రాదనుకుంటా..నాకు తెప్పించినా అస్సను నీకు కన్నీరు పెట్టాల్సిన అవసరమే లేదు..
ఎందుకంటే నీవు మనస్సు చచ్చిపోయిన మనిషివి..అప్పుడు నాతో ఉన్న నీవు కాదు అందుకే ఇలా మారిపోయావు..
చివరికి నాకు కన్నీరే కరెక్టు అంటూ ఎక్కిరిస్తున్నట్టూగా ఉంది..నిజమేకదా ,,

నీవు మర్చిపోయినా జ్ఞాపకాన్నేమో ఓసారి నీ మనసును తట్టి అడుగు..నిజం చెబుతుంది ప్రియా






ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
ఆ బాధ నీ కళ్ళలో కనిపించినపుడు
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేను లోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి …
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీవు పరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నీనిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు
ఆబాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి …
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను...నా పేరే స్నేహం!! ఆ స్నేహాన్ని నేనేతెలుసా..
నీవు మర్చిపోయినా జ్ఞాపకాన్నేమో ఓసారి నీ మనసును తట్టి అడుగు..నిజం చెబుతుంది ప్రియా..

చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...






మౌనాన్ని ప్రేమిస్తున్నా...
నీ మాటలు నాకు చేరడంలేదు కదా...

నిన్ను తాకే గాలిని సైతం ప్రేమిస్తున్నా...
నిను తాకి నను చేరుతోందని...

పగటిపూట కూడా నిద్ర పోవాలనుకుంటున్నా...
స్వప్నంలో నిన్ను చూడొచ్చని...

రాత్రుల్లు నిద్రలేకుండా గడుపుతున్నా..
కన్నీళ్ళలో ఉన్న నీవు కరిగి పోతావేమో అని

నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...

అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా...
ఎందుకంటావా...

నిన్ను చూచినవేళ నా మాట మౌనమవుతుంది...
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...

అయినా హృదయాన్ని వీడిపోని ఆశ మాత్రం నిన్ను చేరాలని తపిస్తూనే ఉంటుంది...
నిను చేరే భాగ్యం ఏనాటి కలిగేనో అని వేచి చూచే నా చిన్ని హృదయానికి ఏమని చెప్పను...
దాని ఆశను నెరవేర్చే ధైర్యం నాకు లేదని... జరిగే అవకాశం లేదని

పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే...







నీ ధ్యాసే...
నలుగురిలో ఉన్నా నీ ధ్యాసే..

నాలుగు గోడల మధ్యా నీ ధ్యాసే...

నడిచే దారంతా నీ ధ్యాసే...

నిదురమాని రేయంతా నీ ధ్యాసే...

పెదాలు చిరునవ్వుల్ని మర్చిపోయి నీ ధ్యాసే...

కనులు కన్నీటిని ఓలకబోస్తున్నా నీ ధ్యాసే...

చిరుగాలుల పలకరింప్పుల్లొ నీ ధ్యాసే...

చిరుజల్లుల పులకరింత్తల్లొనూ నీ ధ్యాసే..

ఎక్కడ ఉన్నా నీ ధ్యాసే...

ఏపని చేస్తున్నా..ఎటుపోతున్నా నీధ్యాసే

నీన్నే తలస్తూ నీకోసమే ఆలోచీస్తూ నాప్రాణాన్ని విడుస్తాను..అది నీకు ఆనంద కదా....?

Wednesday, July 27, 2011

ఎప్పుడూ చూశావో నన్ను నీవు నీకదే నా ఆకరి చూపు..



నాకు కన్నీల్లొస్తున్నాయి నీవు గుర్తుకు వచ్చికాదు
ఎందుకో ఈ మద్యి నామీదనాకే చిరాకేస్తుంది..
నామీద నాకే అసహహ్యింవేస్తుంది..
నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది..

నిన్ను తలచుకునే అర్హత నాకు లేదు..
నీ గురిచించే ఆలోచించే అర్హతా నాకు లేదు..

ఎప్పుడూ చూశావో నన్ను నీవు నీకదే నా ఆకరి చూపు..
నాకేందుకో అనిపిస్తుంది నీకిక అస్సలు కంపించకూడదని..
...నా గొంతు కూడా నీకు వినిపించ్ కూడదని...
....అయిపోయింది అంతా అయిపోయింది..

ఎంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు..వస్తున్నాయి..
ఎవరు నీవు నీకేందుకు చెప్పాలి.. నీవెందుకు వినాలి.. నీకు నేను ఏమౌతా


ఏంటి లోకం అంతా నీళ్ళతో నిండి ఉన్నట్టుగా ఉంది
ఇంతే దు:ఖం అయి ఉంటుంది....
ఇవే కన్నీళ్ళయి ఉంటాయి...
ఇదే నిస్పృహ ఆవరించి ఉంటుంది ఇప్పుడు ఎందుకో...

పగిలి ముక్కలైన మనసుని నీది కాదు నాది
ఉదాసీనమైన మోములో నవ్వు చిందించాలనే వెర్రిప్రయత్నం
వెంట వస్తున్న నిరాశనే నాకు సరైన దేమో

మంచితనాన్ని వాడుకున్న స్నేహపు వంచనలు దాటాను
వదలనంటూనే చేయి వీడిన నేస్తాలను వదిలాను
మాటల బాణాలతో మనసు తూట్లుచేసినా భరించాను
ఎందికిలా చేశానో తెలియడం లేదు
ఈనాడిలా ఓడిపోయను...
కన్నీటిలో కరిగిపోయాను...
నిట్టూర్పులో ఆవిరయ్యాను...
అనంత వాయువుల్లోకి కల్సి పోతున్నా...

నీ మనస్సాక్షికి లోకువయ్యాను...
నేను చెయ్యని నేరానికి దోషినయ్యాను...
కావాలని నీకోసం ఈనాడిలా ఓడిపోయను...
ఎందికిలా చేశానో తెలియడం లేదు

కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడవెందుకు..చెప్పలేని గుండెకోత పొల్చనందుకు...



కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడవెందుకు..చెప్పలేని గుండెకోత పొల్చనందుకు...నువ్వేకావాలి సినిమాలోని తెలుగు సాంగ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే కళ్ళమీద ఉన్న ఈసాంగ్ నాకిష్టమయిన రెండుకళ్ళు ఎప్పుడూనామదిలో కదిలాడుతుంటాయి..ఆ రెండు కళ్ళాకున్న పవర్ అలాంటిది...ఎన్నో భావాలు అవలీకగా పలికించగలవాకళ్ళు ..చల్లని చిరుగాలుల మద్యి సాగే సుతిమెత్తని మెలోడి మ్యూజిక్ ఈ సాంగ్ కు హైలెట్....ఆ రెండు కళ్ళు గుర్తుకువస్తే ఎన్నో పాతభావాలు మదిలో మెదలుతాయి..మనిషిలో దుఖాన్ని ఆనందాన్ని మొదటగా బయలు పర్చేవి ఆ కళ్ళే అని నా ఫీలింగ్ అమె కళ్ళు నాకిష్టిం నాదగ్గర వున్నా లేకున్నా ఆ రెండుకళ్ళ భావాలు ఎప్పుడూ నా మదిలో మెదలుతూనే ఉంటాయి..అమె ఎప్పుడూ అడిగేది ఎందుకలా చూస్తావని అది కుడా కళ్ళతోనె నేను నా మనస్సుతొ సమాదానం చెప్పేవాడిని మీకు వింతగా అనిపించవచ్చు ఇది నిజం..ఆ కళ్ళను చూసిన క్షనానే అనుకున్నా గతాన్ని నా భాదలు మర్చిపోవాలంటే నీకళ్ళలో మెరుపులు చూస్తూ జీవితాన్ని గడిపెయవచ్చు అని ఈ పాటలో ఇద్దరు స్నేహితులు విడిపోయే ముందు వచ్చేపాట నాకు చాలా ఇష్టం కనీసం వాళ్ళిద్దరు అనుకొని విడిపోతున్నారు...బలమైనా కారణం వుండి బట్ మాకు ఎలాంటి కారనం లేకుండానే మేము విడిపొయాము ఎన్నిరకాలు గా ఆలోచించినా మేము అస్సలు కలిసే అవకాశంలేదు..అనే నిజాన్ని మాత్రం తెల్సుకున్నాను ...తను ఎప్పుడు వచ్చినా నేను ...ఇది అస్సలు జరిగే పనికాదు అని మాత్రం....అయినా ఆ కళ్ళలో కళ్ళు పెట్టిచూసే అవకాశం వస్తుందన్న ఆశతోఉన్నా జరగదని తెల్సినా..

ఆ పాట తాలూకా వీడియో మీరుచూడండి..మనసులో బాదలు రేపెట్టే పాట విడిపొతున్న ఇద్దరు స్నేహితుల కు సంబందించింది..




Tuesday, July 26, 2011

పంచదార పెదవులతో వేసే ఈ పూలబాణం






నా కళ్ళలో కధలాడే ఓ వర్ణాల పూలవానా...
తొలకరి మెరుపులు చిలికిన తొలి చినుకులు
విరభూసే గాలి గంధంలా ఆ నింగిన ఆగేనా ...

హాయిగా పండు వెన్నెలని పంచే ఈ రేయి
చీకటే దారిగా వేక్కువను చేరేనా ...

మిణుగురు పురుగుల చిరు వెలుగులు
పండు వెన్నలని పంచే జాబిలినై కాయునా ...
చెరువుల కడుపున విరిసిన తామర తీగలు
గాలిలో మబ్బు రేకుల్లా తేలియాడేనా...
నా మదిలోత్తులలో చిత్రించిన నీ రూపం
కదిలే కల్లల సరిగమై నా కళ్ళను వీడేనా ...

పొద్దే లేని ఈ ఆకాశం నా కళ్ళకి సరిహద్దు వేసింది
హద్దేలేని ఆ ఆనందం ఈ చీకట్టిలో నన్ను మరచింది
ఈ రంగుల వలయంలో రాగాలెన్నో తీస్తునా ...
ఆ గాలి మేడల్లో దీపానై వెలిగేనా ...
పంచదార పెదవులతో వేసే ఈ పూలబాణం
తేన్నెల జలపాతంలా నీ మదిని చేరేనా ......

ఎడబాటుల వేడిమిలో ఎన్నాళ్ళీ నిరీక్షణ,




ఎడబాటుల వేడిమిలో ఎన్నాళ్ళీ నిరీక్షణ,
విరహతాపం చల్లారక నా మది అనుక్షణం నిన్నే తపించేనా,
జాము రాతిరి జాబిలమ్మపై విరహాల చీకటితో, నీ రూపమే చిత్రిస్తున్నా,
నువ్వు నాకు దక్కవని తెలిసినా,

కల్లోల కడలినై ప్రతి క్షణం నీ పేరే స్మరిస్తున్నా,
చెలీ.. నీ ప్రేమ సంద్రంలో నా మనసు నావపై నీ జ్ఞాపకాల అలలను దాటుకుంటూ వెళ్తున్నా,
నువ్వు లేని తీరానికి,

ప్రేమలేని మరో ప్రపంచానికి.....

ఆరుగురు అమ్మాయిల రియల్ ష్టోరీ...!




ఆరుగురు అమ్మాయిల రియల్ ష్టోరీ...!


స్నేహానికి విలువలేని రోజులు...స్వారం తో కూడాన స్నేహం..
ప్రాణం స్నేహితులన్నవారు తనస్వార్దం చూసుకొంటున్నరోజులు...
ఎవర్ని నమ్మాలో తెలియడంలేదు ...ఎప్పుడు ఏక్షనాన అయినా మారొచ్చు...
కారణాలు ఎన్నైనా ఉండొచ్చు..కాని రీజన్స్ అంటూ దూరం అవుతారు..
ఎదుట మనిషి భాదపడుతున్నారని తెలిసినా తాను హేపీగా ఉన్నాఅని చూసుకుంటారు..
ఇక్కడ మంచితనానికి చోటులేదు ...అందరూ నటిస్తున్నారని పిస్తొంది...
ఈమద్యి అనుకోకుండా పరిచయం అయిన అమ్మాయి...?
తనస్నేహితుల విషయం చెబుతుంటే ఆచ్చర్యం వేసింది...?
ఆరుగురు అమ్మాయిలు వాళ్ళది కాలేజీ డేస్ స్నేహం..
కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు కొందరికి పెళ్ళీళ్ళు కూడా అయ్యాయి...
కాని ఇప్పటికీ ఫోన్లు చేసుకోవడం ప్రతి వారం తప్పకుండా కలుస్తారు..
ఒకరికొకరు సహాయం చేసుకుంటారు..భాదలు పంచుకొంటారు..
ఎవ్వరికి ఏకష్టం వచ్చినా..అందుబాటులో ఉన్నవారొచ్చి తోడుంటారు..
ఇలా ప్రతి వారంవారం కలవడం వారు హేపీగా రోజంతా గడపడం చూసాను..
ఇలాంటి స్నేహితులు స్వార్దం లేకుండా ఎలా ఉంటారో అని పిస్తుంది..
నిజాల్ని ఒప్పుకోలేని తప్పుకుంటున్న కొందరు మనుష్యులు ఎదుటి మనుష్యుని భాదను అర్దం చేసుకోలేని స్నేహం..
తన సుఖం చూసుకోని ఎవ్వరు ఎటుపోతే నాకెందుకని...
రీజన్స్ ఉన్నాయంటూ తప్పుకుంటున్నా స్నేహితులకు ఇలాంటీ స్నేహితుల విలువలు ఎప్పుడూ తెలుస్తాయో

Monday, July 25, 2011

కలలోనైనా నీతో మనస్పూర్తిగా గడపాలనుకుంటే





ఆశ... నిరాశే
నీ ఊహలతో బ్రతికే నాకు తెల్లవారుతుంటే భయం
కలలోనైనా నీతో మనస్పూర్తిగా గడపాలనుకుంటే
చీకటికి కూడా విస్సుగ్గా ఉంటుందేమో
ఒక కల చెదిరిపోక మునుపే
నేనువున్నానంటు వస్తుంది వేకువఝాము
నీతో నేనువున్ననానుకొని భ్రమలో
నీ వెంట సాగుతుంటే
ఉలికిపాటుతో నన్ను మేల్కొలుపుతుంది
సూర్యభానుని వుదయకిరణం
పగలంతా నా సహనానికి పరీక్ష పెడుతుంది
నిన్ను గుర్తుకు తెచ్చుకోకుండా వుండాలంటే
మొదట నిన్ను నే మర్చిపోవాలిగా
ఆ మరుపే నాకు సాద్యం కాకుండా వుంది
నిశ్శబ్ద నిశీధిలో నీతో వొంటరిగా
సుదూర తీరాలకు సాగిపోవాలనే ఆశ
నిరాశేనని నాకు తెలుసు మిత్రమా!

నీ సాంత్వన కోసం రేయిపగలు ఎదురుచూస్తున్నాను





నీ సాంత్వన కోసం రేయిపగలు ఎదురుచూస్తున్నాను ....
హృదయాన ఉదయించే తొలి ఆశ వోలె
సంద్రంలో విహరించెడి అల్లల ప్రవాహం వోలె
నువ్వు నడిచే దారిలో మట్టిగా ఉన్న నేను
నీ పాదాల స్పర్శతో
రేయంతా వికసించే వెన్నెల గొడుగులా మారాను ....

మది వీడని తొలి అశపు కలగా
తడి ఆరని ఇసుక రేణువులా
గమ్యం తెలియని ఈ ప్రేమ ఎడారిలో
ఒంటెగా విహరిస్తున్నాను ....

ఊహల కొలనులో విహరించే ఓ పద్మమా
నీ సుగంద పరిమళాల కోసం వేచె ఎన్నో తుమ్మెదలు
నీ మది బాషని మురిపించే తుమ్మెదనై
నీ మేనిసిగ్గు తొలకరిలో పలికే అధరాల పూలరేకునవుతాను
ఆశే శ్వాసగా వీచే పరిమళ వజ్ర పరాగంలా దాగ్గున్నా
నీ సాంత్వన కోసం రేయిపగలు ఎదురుచూస్తున్నాను ....

Sunday, July 24, 2011

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది




నువ్వు "నన్ను మరిచిపో"మని చెప్పిన.....

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.

ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?

ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.

నువ్వు ఎక్కడ ఉన్నానంటే ఏం చెప్పను





నువ్వు ఎక్కడ ఉన్నానంటే ఏం చెప్పను .......
కొన్ని నిద్ర లేని రాత్రుల్లో మేల్కొన్న ఆక్రోశం లో ......................
కొన్ని అర్ధం లేని పనులు వెతికే వెర్రి తనం లో ....................
కొన్ని భావోద్వేగాలు అదుపు తప్పిన ఉన్మాదం లో .............
కొన్ని తీరని కోరికల ఫిర్యాదుల ఆక్రందనలో ................
కొన్ని గుండె చప్పుళ్ళు మొరాయించిన నిస్సత్తువ లో .........
కొన్ని నరాలు తెగే ఉత్కంట రక్త పీడనాలలో .............
కొన్ని శ్వాసలు జీవనాధరాలవ్వని అయిష్టతలో ..............
కొన్ని ఆశలు వెక్కిరించిన అసహాయతలో .............
కొన్ని నిరాశలు ఆశ్రయమిచ్చిన అగాదాలలో ............
కొన్ని స్వేద బిందువులు సేద తీరే అలసటలలో ...
కొన్ని ఆశలు నిరాశ గా మారి నన్ను వెక్కిరిస్తున్నాయి...
కొన్ని జివితాలు ఇంతే అంటూ నీవూ నన్ను వెక్కిరిస్తున్నావు కదూ..

ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,





జ్యొతివై నా చీకటి హృదయంలో వెలుగు నింపుతావనుకున్నాను,
కాని జ్వాలవై నా హృదయాన్ని మండిస్తున్నావు,
ఐనా ఆనందమే నీ చూపుల జ్వాలలలో మండుతున్నందుకు.
అలవై నా మనసుతీరం తాకుతావనుకున్నాను,
కాని కలవై నన్ను విరహసంద్రంలోకి తోసేశావు,
ఐనా ఆనందమే నీ మనసులోతు తెలుసుకుంటున్నందుకు.
నింగివై నీ ప్రేమ జల్లులలో నన్ను తడుపుతావనుకున్నాను,
కాని పిడుగువై నా గుండెని బూడిద చేశావు,
ఐనా ఆనందమే నీ కన్నుల కాంతిలో నా గుండె బూడిదైనందుకు.
ఊపిరివై నా గుండెలో నిండిపోతావనుకున్నాను,
కాని ఉప్పెనవై నామనసును నా నుండి దూరంగా తీసుకెళ్ళిపోయావు,
ఐనా ఆనందమే నన్ను వదిలిన నా మనసు నీతో వెళ్ళిపోయినందుకు.
భువివై నన్ను నీ ఓడిలో దాచుకుంటావనుకున్నాను,
కాని భూకంపమై నీ మాటల ప్రకంపనాలతో నా ప్రాణం తీశావు,
ఐనా ఆనందమే నేను మరణించినా నా తనువు నీలో ఐక్యమవుతున్నందుకు

హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ కేసులో వరుణ్ సందేస్ ఉన్నాడా ? అసలేం జరిగింది..?

హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ కేసులో వరుణ్ సందేస్ ఉన్నాడా ? అసలేం జరిగింది..?.....వారం రోజుల క్రితం... వెష్టుజోన్ డిసిపి టీం... పక్కాసమాచారంతో తనికీలు చేస్తుండగా...సిద్దార్ద అనే డాక్టర్ డ్రగ్స్ పోలీసులకు చిక్కాడు..ఆ సమయంలో సిద్దార్ద డ్ర్రగ్స్ తీసుకొని ఉన్నట్టు పసిగట్టిన పోలీసులు డాక్టర్ సిద్దార్దను అదుపులోకి తీసుకోని వారిష్టైల్ లో విచారించగా...తాను డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తనతో పాటు హీరో వరుణ్ సందేష,మరోహీరీ,నిర్నాత రవిలు కూడా తీసుకున్నారని ....తమకిది కొత్తకాదని ప్రతివారాంతరంలో పార్టీ చేసుకుటామని అపుడు ఇలా డ్రగ్స్ తీసుకుంటామని చెప్పడంతో వరుణ్ సందేష్ రెఢ్ హేడెడ్ గా దొరకలేదు కాబట్టి ..ఏవ్వరినుంచి డ్రగ్స్ దొరుకుతున్నాయో పెడ్రిక్ ను వల పన్ని పట్టుకున్నారు....మొత్తానికి లంగర్ హౌస్ రింగ్ రోడ్డులో దొరికారని మీడియాకు చెప్పుకొచ్చారు పోలీసులు ... వరుణ్ సందేష్ డాక్టర్ సిద్దార్దతో ఎప్పుడూ కమ్యూని కేషన్ లో ఉంటాడని తేలింది సెల్పోన్ కాల్ రిజిష్టృఈ ఆదారంగా ఇప్పటికే పొలీసులు కీలక సమాచారం రాబట్టారు...కాని కొందరు సినిమా ఫీల్డ్ కు సంబందించిన పెద్దలు రంగంలోకి దిగి వీళ్ళను ఈకేసునుంచి తప్పించారనీ వినిపిస్తోంది...మరో వైపు ఇంకో వాస్తవం కూడా వినిపిస్తుది...
డ్రగ్ర్స్త్ తో దొరికిన్ రోజు..లంగర్ హౌస్ రింగ్ రోడ్డులో డ్రగ్స్ అమ్ముతున్నారన్న సంచారం అందుకున్న లంగర్ హౌస్ పోలీసులు..మఫ్టీలో వెల్లగా అక్కడ ,ఫెడ్రిక్ వదనుంచి డాక్టర్ సిద్దార్ద డ్రగ్స్ కొంటుండగా దొరికారు వీళ్ళు పట్టు పడటానికి కొ ద్ది చేపటికి ముండా వరుణ్ సందేష్ ఆటో లో వచ్చి డ్రగ్స్ పట్టుకెళ్లాడని ..మరో వైపు పొలీసులకు వరుణ్ సందేష్ రెడ్ హేండెడ్ గా దొరికినా పోలీసులు పైనుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వదిలి వేశారని తెలుస్తోంది మొత్తం మీద వరుణ్ సందేష్ డ్రగ్స్ వాడుతున్నాడని తేలుతోంది...ఈ విషయాన్ని డాక్టర్ సిద్దార్ద ఇంటరాగేషన్ లొ ఒప్పుకున్నాడు..మీడియాముందు కూడా ఒప్పుకున్నాడు మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి జంకుతున్నారు ఆ పెరుమాళ్ళకే తెలియాలి...


డ్రగ్స్ తో హీరో వరుణ్ సందేష్ దొరికాడని పక్కాసమాచారం రాగానే బ్రేకింగ్ న్యూస్ తో నా ఫోన్ ఇన్...వీడియో ఇది



ఆరువాత లంగర్ హౌస్ పోలీస్ ష్టేషన్ నుంచి..ఎప్పటి కప్పుడు సమాచారాన్ని లైలో ఇస్తున్నప్పటి వీడియో ఇది

..

ఆరువాత లంగర్ హౌస్ పోలీస్ ష్టేషన్ నుంచి..ఎప్పటి కప్పుడు సమాచారాన్ని లైలో ఇస్తున్నప్పటి వీడియో ఇది

Saturday, July 23, 2011

అరె! .ఏమైందీ... మనసుకు రెక్కలొచ్చి ..ఎక్కడికొ ఎగిరింది

చిరంజీవి సినిమాల్లొ ఇదో మంచిసాంగ్ మనసుకు సంబందించి తన లోని భావాలు మనస్సుతో పొలుస్తూ పాడే పాట ...నిజంగా చాలా అద్బుతమైన పాట..మనస్సులో ఉప్పొంగే ఉప్పెనలను లోలోపలె పేరుక పోయిన భాదను ఈ పాట రూపంలో వ్యక్తంచేసినట్టూంటుంది..ఇష్టమైన వాళ్ళు కనిపిస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఈపాటే పాడాలనిపిస్తుందేమో అనిపిస్తుంది మాటల్లో చెప్పలేని భావాలు పాటరూపంఅంటే ...ఇలాగే ఉంతుంది కదా..? మీరు ఆపాట పాడుకోవాలనిపిస్తే ఇక్కడ ఉండి చూడండి ఆపాటలో "ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైందీ...తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందికలగాని... కల ఏదో... కళ్లెదటే నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది..." చూశారా ఎంత అద్బుతంగా ఉందో ఆపాట పదాల అమరిక ప్రతిక్షనం గుండేల్లో అలజడుల ప్రతిరూపమే ఈ సాంగ్..ఇంకా ఈపాటగురించి ఏదో చెప్పాలని ఉందికాని..మాటలు రావడంలేదు..అంత అద్బుత మైనపాట ఇది

పల్లవి :
అరె! ఏమైందీ... అరె! ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ...
తన మనిషిని వెదుకుతు
ఇక్కడొచ్చి వాలింది
కలగాని... కల ఏదో...
కళ్లెదటే నిలిచింది
అది నీలో మమతను
నిద్దుర లేపింది... ఆ ఆ ఆ... ॥

చరణం : 1
నింగి వంగి నేలతోటి
నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం
పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు
పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు
నింగిైవె పు చూపులేదు
కన్నెపిల్ల కళ్లలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావే... ఓ...

చరణం : 2
బీడులోన వాన చినుకు
పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన
పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు
గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే
పాట నీవె రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు
వీడు మారిపోతాడు
మనిషౌతాడు...

ఆ అద్బుత మైన పాట తాలూక వీడియో చూడండి ..నిజంగా మనసు ఉన్న మనుషులైతే నిజంగా ఎవ్వరిని అయినా ప్రేమించి ఉంటే కంట కన్నీరు రావల్సిందే

అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోయావు...





స్వప్నమై వచ్చి మదిలో చేరావు...
తలపుల్లో నిలిచి మనసు తలుపులు తెరిచావు...
ఎవరిలేని ఒంటరి పయనంలో నీకు తోడు నేన్నావు...
కంటనీరు చిందినవేళ నేనున్నానంటూ ఓదార్పు నిచ్చావు...

మోడువారిన జీవితంలో వసంతాలు పరిచయం చేశావు...
జీవితమంటే అర్ధం చెప్పి ఎనలేని ధైర్యానిచ్చావు...
అర్ధం లేని జీవితానికి నీవే పరమార్థమయ్యావు...

అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోయావు...
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందకు కాదన్నావు...
నీవు నాపై చూపిన అభిమానాన్ని ప్రేమనుకోవడం తప్పునుకున్నావు...
నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...

నాపై నీకు ప్రేమలేకుంటే ఇదంతా ఎందుకు చేశావు...
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమను నాకెందుకు పరిచయం చేశావు...

చెప్పు ప్రియా... ప్రశ్నిస్తేనే జీవితమన్నావు... నా జీవితం కోసం నేడు నిన్ను ప్రశ్నిస్తున్నాను... నా ప్రశ్నకు బదులివ్వగలవా...

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...




వెన్నెల్లో తారకలా అలరించే నీరూపం
చూస్తున్న వేళ...

నీకు చిక్కిన నా చూపుల కాంతిలో
కన్పించలేదా ఏ భావం ?

వికసించే మల్లెలలోని పరిమళం...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...

మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...

ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.

తడబడి తల తిప్పుకున్న నాలో వినిపించలేదా
నీకే పలికే ఏ మౌనరాగం ???

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...
ఎప్పుడో మర్చిపోయిన నన్ను నేను కనుగొన్నాను.

చెక్కిలి దాటని ఆ నునులేత సిగ్గు దొంతరలో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరయ్యాను

నా కన్నులు మూసి నీ కౌగిలి చేరే నా కన్నీటి ని ఆదరించి





నీ ఎడబాటు లో తన తోడుటుందన్న ఆశ కలిగించి
సాగుతుంది నేడు నీ తలపులు తాకగానే నన్ను విడిచి
ఎంతగా ఆపినా నా చేతిన్ని అడ్డుగా ఉంచి
ఇసుమంతైనా జాలి లేక పోతుంది నన్ను విదిల్చి
సాగింది నా జీవితం నీ జతలో తనన్ని మరిచి
నేడు ఎలా ఉండగలదు నా మాట మన్నించి
నా పై కోపమో ? నీ పై ఇష్టమో తెలియని అయోమాయపు స్దితి
కారణం ఏదైనా ఇక సాగాలి ఒంటరిగానే నా గతి
నా కన్నులు మూసి నీ కౌగిలి చేరే నా కన్నీటి ని ఆదరించి
కాలకాలం నీ పెదవుల పై నిలుపుకో చిరునవ్వులుగా మార్చి

నా కన్నీటితో నీకు జలకాలాటలేలా? ...వేచిచూస్తా నీకోసం ....




వేచివుంటా నీకోసం .....
వేచివుంటా నీకోసం .....
బతుకుదెరువు పోరాటంలో
బడలికలేని పయనం కోసం
పొగబండికై కాపు కాసే కూలిలా !

వేచిచూస్తా నీకోసం ....
నింగి తొంగిచూసి మలయ మారుతాలను
ముత్యాలుగా రాల్చేదాకా
నమ్మకం కోల్పోని రైతులా !!

వెంటపడుతున్నా ఒడి చేరవా?
వేడుకుంటున్నా కనికరింపవా?
నా కన్నీటితో నీకు జలకాలాటలేలా?
నా ఊహలతో నీకు సయ్యాటలేలా?

భగవంతుడా!
నీవైనా కరిగింపవా ఆ కరగని మనసును,
ఇప్పించవా చోటు ఆ సిలాంతరాలాల్లో,
నా హృదయ మంటలు ఆరని చితి మంటలై
నను నిలువెల్లా కాల్చకముందే !
నా ఊహలన్నీ ఓ ఉప్పెనై
నా మస్తిస్కాన్ని మట్టుబెట్టకముందే :(

నీ కలలే నా జీవితం ...కనుమరుగైన కలలాగే..?





నీ కలలే నా జీవితం !!
నీ తలపుల వాకిట కునుకు తీసా!
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే

నిరాశతో గృహము చేరా
నిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు చిత్రపటంలో
నా రాకకై ఎదురుచూస్తూ

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

Friday, July 22, 2011

నటించడం చేతకాక పోతే ....నా ప్రేమలో స్నేహం లో నిజాయితీ లేనట్టా...?




మనుషులు ఎందుకిలా మారుతున్నారు..మనసనేది లేకుండా...
మనిషిలోని మనసును చంపుకిని ఎందుకిలా బ్రతుకుతున్నరో అర్దం కావడంలేదు..
ఎదుటి మనిషి భాద పడుతున్నాడని తెల్సి....స్వార్దం చూసుకుంటోంది స్నేహం..
నీతి నిజాయితీ ఇక్కడ పనికి రాదు...నటననే నమ్ముతుంది లోకం అదేనిజం అని..
స్నేహాన్ని రుజువు చేయాలంటే నటించాలా.....?
స్వచ్చమైన నిజమైన ప్రేమను రుజువు చేసుకోవలంటే కూడా నటించాలా..?
అలా నటించక పోతే ప్రేమ నిజంకాదంటున్నారు..దూరం అవుతున్నారెందుకో..
నేనున్నానంటూ పలుకరించి దైర్యం చెప్పిన స్నేహంలో కూడా ఇన్ని మార్పులా..
నటించడం చేతకాక పోతే ....నా ప్రేమలో స్నేహం లో నిజాయితీ లేనట్టా...?
నీకోసం ఎంత వేదనను మౌనంగా భరించానో తెలుసా..ఎంతగా పరితపిస్తున్నానో తెలుసా..
ఇప్పుడు నేను బ్రతికున్న శవాన్ని అలా మార్చావు నన్ను..
ఒకప్పుడు ఎప్పటికైనా నిజం తెల్సుకుంటావన్న నమ్మకం ఉండేది.. ?
ఇప్పుడా నమ్మకం పోయింది నిన్ను కాదు నన్ను నేను కూడా నమ్మే స్థితిలో లేను..
నీకోసం నాకు నేను ఎన్నోసార్లు ఓడిపోయాను ..తరువాత నీవే ఓడిస్తూ వస్తున్నావు..
చివరకు ఓ మనిషికోసం గెలుపనేది నాజీవితంలో లేకుండా చేసి హాయిగా ఉన్నావు...
నీకిది న్యాయమా అని నిన్ను నిలదీసి అడుగలేను ...ఎందుకంటే నీవు భాద పడకూడదు..
ఎక్కడ ఉన్నా నీవు హాయిగా సంతోషంగా ఉండాలనే చిన్న స్వార్దం నన్ను నేను కాల్చుకునేలా చేస్తుంది..
మనిద్దరం ఇష్ట పడ్డప్పుకు రీజన్స్ గుర్తుకు రాలేదా..అప్పుడు లేనివి ఇప్పుడెలా వచ్చాయి..
ఎన్ని రీజన్స్ అయినా పెట్టుకో కాని నేనిక నీకు దక్కే అవకాశం లేదు..అని మాత్రం తేలింది..
నా మనస్సులో నీకున్న స్థానం నీవు తెల్సుకోలేక పోతున్నావు..
నీవు హేపీగా ఉండాలన్నది నిజం ...నేన్నది గతం...మర్చిపోయావు నన్ను పూర్తిగా..
భాదపడటం అలవాటుచేశావు ..బరిస్తున్నా భారంగా తట్టుకోలేక పోతున్నా..
అన్నీ నీకు తెల్సు కాని నీలో కించిత్ భాదలేదు నీకు కావల్సింది నీ సుఖం నేను కోరుకునేది అదే కదా...?

నాకు దూరం అయ్యావెందుకు..నన్ను ఒంటరిని చేశావెందుకు..?




చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..

నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు
నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి
కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!

పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు..
కన్నుల నిండా ఉన్న కన్నీరు..
ఎదుట ఉన్నది ఎవ్వరీ అర్దం కావడంలేదు..
చూశావా నీకోసం ఎదురు చూస్తున్న నాకు నీవు ఏదురుగా ఉన్నా..?
చూడలేని గుడ్డివాన్ని అయ్యాను...ఒకప్పుడు నీవన్నది నిజం
ఎందుకంటే ఇప్పుడు నీవన్నది ఇప్పుడు బ్రమ...
ఎందుకిలా మారావని అడుగను అడిగే హక్కు లేదు కదా...?
మనం నుంచి నాకు దూరం అయ్యావెందుకు..నన్ను ఒంటరిని చేశావెందుకు..?
ప్రతినిమిషం..ప్రతిక్షనం నీగుర్తులు గుండెళ్ళో అగ్ని రాజేస్తున్నాయి..
ఆ అగ్నిలో దహించుకు పోతున్నా అని తెల్సి..నీవెలా ఉండ గలుగుతున్నావు..

నాతో రాకంది చావు...ఛీ! ఛీ! నీవు నాకు వలదని!





నన్ను వదిలి వెళుతూ అన్నావు నవ్వమని
నన్ను వదిలి వెళుతూ అన్నావు నవ్వమని
నవ్వేసాను నేను నీ ఆనందం కోసమని!

నీకు ఎరుక నాకు దక్కనిది నాది కాదని
నీవు వదిలిన నేను నీకు మాత్రమే సొంతమని!

నాకు తెలుసు నీకు నాపై ఎంతో నమ్మకముందని
నీకు తెలియని నిజం నా అదృష్టం నన్ను కాదన్నదని!

నాది అనుకున్న చావుని కోరాను తనతో తీసుకెళ్ళమని
నాతో రాకంది చావు...ఛీ! ఛీ! నీవు నాకు వలదని!
నన్ను నేనే ప్రశ్నించు కున్నాను ఈ జీవితం నాకు ఎందుకని?

మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి




ఎక్కడ వున్నాయ్
ఎక్కడ వున్నాయ్ ఆ దివ్య లోకపు మంటలు ......
మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి.......
ఎక్కడ వున్నాయ్ ఆ అనంత ప్రేమ సాగరాలు ....
వేడుకుంటున్నాను నన్ను మీలో నిమజ్జనం చేయండి ..
ఎక్కడ వున్నారా కాలాతీత జ్ఞానులు ......
ప్రార్థిస్తున్నాను సిద్దంతపు మరకలు అంటని ఈ కాగితం ఫై ఏదైనా రాయండి ....
ప్రపంచపు బాధ సూది మొనలా చిత్ర హింసలు పెడుతుంది ......
నా అస్తిత్వాన్ని మరిచేలా ఎవరైనా ఏదైనా చేయండి

పొద్దే లేని ఈ ఆకాశం నా కళ్ళకి సరిహద్దు వేసింది





తొలకరి మెరుపులు చిలికిన తొలి చినుకులు
విరభూసే గాలి గంధంలా ఆ నింగిన ఆగేనా ...
హాయిగా పండు వెన్నెలని పంచే ఈ రేయి
చీకటే దారిగా వేక్కువను చేరేనా ...

మిణుగురు పురుగుల చిరు వెలుగులు
పండు వెన్నలని పంచే జాబిలినై కాయునా ...
చెరువుల కడుపున విరిసిన తామర తీగలు
గాలిలో మబ్బు రేకుల్లా తేలియాడేనా...
నా మదిలోత్తులలో చిత్రించిన నీ రూపం
కదిలే కల్లల సరిగమై నా కళ్ళను వీడేనా ...

పొద్దే లేని ఈ ఆకాశం నా కళ్ళకి సరిహద్దు వేసింది
హద్దేలేని ఆ ఆనందం ఈ చీకట్టిలో నన్ను మరచింది
ఈ రంగుల వలయంలో రాగాలెన్నో తీస్తునా ...
ఆ గాలి మేడల్లో దీపానై వెలిగేనా ...
పంచదార పెదవులతో వేసే ఈ పూలబాణం
తేన్నెల జలపాతంలా నీ మదిని చేరేనా ......

Thursday, July 21, 2011

నిన్ను ఎప్పడు చూస్తానో...మాట్లాడుతానో తెలీదు..ఆ ఆశ ఎప్పుడో చచ్చిపోయింది




మనసులో గాయాలు రేపావు...
తట్టుకోలేని భాదను మిగిల్చావు....
హాయిగా నీ దారీ నీవుచూసుకొని నాకు ఎడారి దాని అన్నావు...
నీకోసం ఎన్నో భరించాను మౌనంగా...ఎందుకోతెలీదు..
ఎప్పుడూ నీవు నవ్వుతూ ఉండాలనే చిన్న స్వార్దం..
నన్ను నేను అసహ్యించుకేనేంతగా నీకోసం భాదలు భరించాను..
నీకోసం ఏదోచేశానని చెప్పుకోవడం కాదు..అలా నాకిష్టం ఉండదు..
ఒక్కటి మాత్రం నిజం ఇక జన్మలొ నాతో మాట్లాడవని..
చేయని తప్పులకు బలి చేశావు..నటించే వాళ్ళనే నమ్ముతున్నావు..
ఒక్కటి మాత్రం నిజం...నీవు దారుణం గా మోసపోయే రోజొస్తుంది...
అప్పుడు అసలు నిజం ఏంటో తెల్సుకుంటావు....?
నీచుట్టూ ఉన్నవన్నీ నిజాలు అని నమ్మకు కాస్తజాగ్రత్త..
నాకు దూరం అయ్యావని ఇలా అనటం లేదు..
నీవు అన్నీ నిజాలు తెల్సుకొని నాకోసం వెతికితే అప్పుడు నేనుండను..
ఎంత వెతికినా ..ఎంత అరిచినా వినరాని కానరాని చోటకి పోతా..
నీతి..జాతి లేని మనుష్యులంటే చిరాకేస్తుంది...నటించడం నావల్ల కాదు..



కొన్ని నిజాలు నీవు తెల్సుకోవాలి కాని నీవు నాకు ఆవకాశం ఇవ్వడంలేదు.... ఇస్తావన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే కారణం చెప్పలేను నీవిలా ఎందుకు మారావన్నది నాకు ఇప్పటికీ అర్దం కావడం లేదు

జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.





చిన్న చిరునవ్వుతో నీ గుండె చెరలొ బంధించావే,

ప్రేమగా మారి మనసులో చేరకపొయినా,

జ్ఞాపకమై నా గుండెలొ చేరావు,

మౌనన్ని మంత్రంగా వేసి మాయచేసి మరలిపొతున్నావు,

జ్ఞాపకాలను గుండెలో గుచ్చుతూ తియ్యని గాయం చేస్తున్నావు.

నీ మాటలతో ఆ మౌనం కరిగేదెప్పుడు,

నీ ప్రేమతో నా గాయం మానేదెప్పుడు.

కనుపాపలు కురవనివ్వని కన్నీటి వర్షం ...నిన్ను మరవనివ్వదు ...




మరవనివ్వదు .....మరపురానివ్వదు .......
మజిలిలో మలిగా తాకిన నీ ఊపిరి స్వరం మరవనివ్వదు
పెదవి చెర దాటని గుండె లోని భావం మరవనివ్వదు
కనుపాపలు కురవనివ్వని కన్నీటి వర్షం ...నిన్ను మరవనివ్వదు ...
కనిపించే నీ నయనం విడిచిన భాష్యాల బాణం మరపురానివ్వదు
ఆశించని నీ కరమిచ్చిన తొలి చెలిమి వరం మరపురానివ్వదు
మరలా మరలని అడుగుల దురాల పయనం మరపురానివ్వదు
మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం మరపురానివ్వదు
తరువాత యుగాన్ని తలపించిన నిజాల నిమిషం మరపురానివ్వదు...... నిన్ను
"కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణిచివేస్తున్నా ,
మరణించే కాలం మిగిలిఉండే వరకు నా చెలియ మరవనివ్వదు.. తన చెలిమి మరపురానివ్వదు .. "

నిన్ను పూజించని పుష్పాన్నై నీ ముంగిటే వాడిపోదును ప్రియా...





ఓ కాలమా ఎన్నాల్లీ నిరీక్షణ నాకు
నీ ఆగమనం ఓ వవ్య వసంతం అనుకోవాలా లేదంటే
సంధ్యా సమయపు చీకటి ద్వారాలనుకోవాలా
నీ పలకరింపు తొలి ఉశస్సు మేలుకోలుపనుకోవాలా లేదంటే
ఎడారి దాల్చిన హరిత వర్ణమనుకోవాలా
నా సన్మార్గపు నిత్యాన్వేషణ నీతో సహగమించి సార్థకత పొందాలని
నీ మమతల మైదానంలో అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నాను
విజయం సిద్ధిస్తే నీ మనసు కోటకు చక్రవర్తినవుతాను
లేదంటే అడవి కాచిన వెన్నెలలా వృధా అయిపోదును
నిన్ను పూజించని పుష్పాన్నై నీ ముంగిటే వాడిపోదును ప్రియా...
వరమై కరుణించి నన్ను స్వాగతిస్తవనీ నీ కోసం వేచివుంటున్నకావాలనుకుంటే నీ తోడు.

Wednesday, July 20, 2011

కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?




ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?

తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?

ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?

గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?


అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......

జ్ఞాపకాలు చేదయ్యాక తానో తీపి గురుతుగా మిగిలిపోతూ ...





ఇదో స్వబంధ సంబంధం ఇదో నిర్బంధ నియమం ..
"అను" బంధాలను అనుభవించని అనుభవైకిక వేద్యం .
ద్వీతీయతకు తావు లేని అద్వితీయ అద్వైతం.
నీడను సైతం తిరస్కరించే నిరంకుశ తత్వం
ఆత్మావలోకనమే తన లోకం ......స్థిమితం స్థితప్రజ్గ్నం తన స్వరూప స్వభావం
స్పందనలతో పనేముంది .........నిరంతర నిశ్శబ్దం
నిత్య సంగీతమై హృదయ స్పందనగా మారినపుడు ....
పులకింతలో పసేముంది .....పలకరింతకు నోచుకోని
పాశవికం పాశమై అల్లుకున్నప్పుడు ...
పోగొట్టుకున్న జ్ఞాపకాలు వెతికి పెడుతూ ............
జ్ఞాపకాలు చేదయ్యాక తానో తీపి గురుతుగా మిగిలిపోతూ ...
భయానికి హేతువు అవుతూ , ధైర్యానికి ప్రేరణ నిస్తూ .
ఆత్మా దేహాన్ని వదిలే నిర్దయతకు నిరూపితమవుతూ .
నిత్యం నిలిచి వుండేది ఒంటరితనం ....ఇది స్వగతం,ఇదో స్వీయ చరితం

గడచిన మధుర క్షణాలన్ని........భాదనే ఎందుకు మిగులుస్తాయో....?




గడచిన మధుర చేదు క్షణాలన్ని........
సంధ్యా కాలపు సుర్యుడి వెలుగులో........
సంద్రపు ఒడిన సేదతీరుతున్న వేళ
ఎగిసి వస్తున్న కెరటాల సవ్వడి.......
కాలచక్రంలో కరిగిపోయిన వాస్తవాలని జ్ఞప్తికి తెస్తుంటే
ఆ మధుర స్మ్రుతుల తీయదనాని పెదవులు దరహాసం చెస్తున్నా.........
మది మాత్రం ఆ అనుభూతుల స్మరణలో........
భారంగా మారి ఎందుకు భాదిస్తుంది?
గత కాలపు సుందర అనుభవాలు కూడ.......
సంద్రపు అలలలో చేరి ఎందుకు కల్లోల పరుస్తాయో..
గడచిన మధుర చేదు క్షణాలన్ని........
భవిష్యత్తు లో భాదనే ఎందుకు మిగులుస్తాయో....?

Tuesday, July 19, 2011

ఇదే నా చివరి లేఖ.....?




నీ స్నేహం ఎడారిలో నవ వసంతం
నీ తలపు కడలిలో దారిచూపిన ధృవకిరణం
నీ సహచర్యం నిశీధిలో నను తాకిన శశికిరణం
కదిలే కాలం తన కాళ్ళ కింద నా హృదయాన్ని అణచివేస్తున్నా......
మరణించే కాలం మిగిలున్నంతవరకు ఓ చెలియా....
నీ చెలిమి నిన్ను మరవనివ్వదు
నీ జ్ఞాపకం నిన్ను మరుపు రానివ్వదు
నీతో గడిపిన క్షణాలన్నీ ఇకపై నన్ను ప్రశ్నిస్తాయి
ఎందుకు మళ్ళీ ఆ అవకాశాన్ని మాకివ్వడంలేదని?
నీతో మాట్లాడిన నా హృదయం
నిన్ను కలిసే వరకు నాతో మాట్లాడనని మారాం చేస్తుంది...!
నీతో నడిచిన నా పాదాలు తమతో నడిచే నీ పాదాల కోసం ఎదురుచూస్తాయి....
వాటికి తెలియదు కదా.. ఇకపై మనం కలవమని కలిసుండే కాలం తిరిగిరాదని
నా కళ్ళకి చీకటి రాబోతుంది నా గొంతు మూగబోవడానికి సిద్దమవుతుంది
నా శరీరం నుండి నా హృదయం వేరు చేయబడుతోంది
నీ మనసుకి దూరమైపోవాలని వెళ్తున్న నాతో
నా హృదయం అంటుంది నన్ను ద్రోహిని చేశావు కదరా.... అని
దానికి ఏమని సమాధానం చెప్పను?
గుండెనిండా దు:ఖం ఆపుకుంటూ అణచుకోవడానికి ప్రయత్నిస్తూ పారిపోతున్న.... అలిసిపోతూ పరుగులు తీస్తున్న
నేనేమైపోయాననే ఆనవాళ్ళు కూడా నీకు తెలియనంత వరకు పరుగులు తీస్తూనే ఉంటా
బహుశా! ఈ పరుగు "జీవితం లో ఏదైతే నా దగ్గరికి రావొద్దనుకున్నానో దాని ఒడి చేరే వరకేమో
అదేంటో అని ఆలోచిస్తున్నావా? అదిగో చూడు నా వైపు వెటకారంగా చూస్తూ హేళన చేసే నవ్వుతో
నాకు స్వాగతం పలుకుతుంది..................ఒంటరితనం

...ప్లీజ్ నేస్తం ఒక్కసారి తిరిగిచూడవా... చూడవని తెల్సూ కాని..?

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,




నా ప్రేమకు ప్రేరణ నువ్వు,

నా గుండెకి ఊపిరి నువ్వు,

ఎదను గెలవాలన్న,

వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,

ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,

ప్రేమ నేరమా మరి,

ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.

నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,

నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,

అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,

మనసుని వేధించే బాధ,

ప్రేమ అంటే బాధేనా,

మనసు మనల్ని మరచి,

మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?

నన్ను నన్నుగా వుండనీయదెందుకు?

నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?

నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?

ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,

తెలిసి నువ్వు నాకు చేరువవవు,

ప్రేమ నన్ను వదిలేయి,

తనని నా నుండి దూరం చెయ్యి,

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,

ఇక తట్టుకోలేను నేను శాశ్వితంగా దూరంగా వెళ్ళిపోతున్నా.

Monday, July 18, 2011

నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను





నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను
నువ్వే కనిపించకుండా పోతావు
నీ సాన్నిహిత్యంలో సేద తీరాలనుకుంటాను
ఎండమావివై వెక్కిరిస్తావు
నీ ప్రేమరాహిత్యంలో ఘనీభవించిన హృదయాన్ని
నీ వెచ్చటి కన్నీటి జల్లుతో కరిగిస్తావు
కరిగి కన్నీరయిన నన్ను
మండుటేండగా మారి మరిగిస్తావు
హృదయం చాలని అనుభూతివనుకుంటే
జన్మకు చాలని ఆవేదన మిగిలిస్తావు
చివరకు నీపరిచయం నామరనానికి నాంది అనేలా చేస్తావు

అప్పుడే వర్షానికి తడిచి నీటి బిందువులతొ మెరుస్తున్న తామరాకులో,





అప్పుడే వర్షానికి తడిచి నీటి బిందువులతొ మెరుస్తున్న తామరాకులో,

చిమ్మచీకటిలొ వెలుగునిచ్చే జాబిలమ్మలో,

తెల్లవారుజామున పడుతున్న మంచుబిందువులో,

వేకువనే వినిపించే సుప్రభాతంలో,

ఆరుబయట వేసిన రంగులముగ్గులో,

ఒడిలొని చంటిపిల్ల చిరునవ్వులో,

సంధ్యా సమయాన అస్తమించే సూర్యుడి అరుణంలో,

ఎగసిపడి తీరం చేరే సముద్రపు అలలలో,

అన్నింటి లోను నువ్వే,

ప్రతి అందంలోనూ నువ్వే, అనందంలోను నువ్వే.

ఇలా అన్ని చోట్ల నిన్ను చూసుకుంటున్నా బ్రమల్లో బ్రతుకుతున్నాని తెలీక..

నేనిలా నీకోసం తపన పడుతుంటే ..నేనేవరో తెలీనంత బిజీగా నీవు..

నాకు తెల్సి నీవు నన్ను మర్చిపోయిఉంటావు గుర్తుంచుకునేంట గొప్ప స్నేహం కాదు కదా నాది..

నాకిష్టమైనవాళ్ళు నావాళ్ళనుకోవడం వాళ్ళు నాగురించే ఆలోచించాలనుకోవడం చివరికి ఓ పిచ్చోడీలా నన్ను చూసి నవ్వుకోవడం

Sunday, July 17, 2011

ప్లీజ్ ఇలాంటి అబద్దాలు ఎవ్వరితో అనకు PLEZEEEEEEEE....?

ప్లీజ్ ఇలాంటి అబద్దాలు ఎవ్వరితో అనకు నిజం అని నమ్మి జీవితం నాశనం చేసుకుంటారు

వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నాపరిస్థితి అదే...అన్న నీవు బాగానే ఉన్నావు ...ఆ మాటలు నమ్మి నేనిలా ఉన్నాను..
మళ్ళీ ఏవరో ప్రవేశించడం నిష్కారనంగా ఎవ్వరో ఏదోచెప్పారని వాళ్ళ మాటలు నమ్మి దారునంగా మాట్లాడటం...
తప్పని తెలినా ఒకరి హేపీనెస్ కోసం మౌనంగా ఉండటం...నీవు మంచిదానినే ఎందుకిలా చేస్తున్నావో అనేది అర్దంకాదు...
ఇలా ఎదుటివారిని భాదించడం నీ క్యారెక్టరే కాదు కాని అలా చేస్తున్నావెందుకో...?




మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు




మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు

నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు

ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు

మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు

వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు

సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు

ఇప్పుడు మనసు చచ్చిన మనసు లేని మనిషివినీవు..
ఎందుకిలా అయ్యావో తెలీదు అవుతున్నావో తెలీదు కారనం చెప్పలేను..

నీలో ఇంత మార్పు నేనూహించలేదు...నీ క్యారెక్టర్ కు విరుద్దం ఇప్పుడున్న నీవు..
ఇంకా మిగిలి ఉన్న నీ జీవితమజి లీలో ఎన్ని వింతలు చూపిస్తావో నాకు దూరం అయినా

చెపితే నువ్వు నమ్ముతావో నవ్వేసి పోతావో




చిరుగాలి స్పర్శే లేక ....
చివురాకు కమిలిపోయే .......
చందనాల పరిమళాలు మోసుకోస్తావో లేదో
మనసైన గీతం వినక ......
మాపటికి వెలుగే రాదే ........
జాబిలింక చిచ్చుబుడ్డై నవ్వుతుందో లేదో
కలలన్ని నిజమవ్వక .......
కునుకన్నది రానే రాదే.........
నీ కళ్ళ వాకిళ్ళు తెరిచేది ఎన్నడో
తలనిమిరే తపనే తీరక
కురులన్ని చెదిరిపోయే ......
నీ ముని వెళ్ళు నాట్యాలు నేర్చాయో లేదోతడి తీరని ఆశలన్ని ......
తుడిచేసి పోవటానికి .......
తువ్వాలై నీ తోడు దొరికేది ఎప్పుడో ....

నడకలనే మరిచిన గుండె
గంతులనే నేర్చిందని
చెపితే నువ్వు నమ్ముతావో నవ్వేసి పోతావో ..
అందర్నీ నమ్మడం నన్ను నమ్మక పోవడం నీకలవాటేగా..

భాను అరెష్ట్ అయ్యాడా లొగిపోవడానికి చూస్తున్నాడా..?

సూరి హత్యి కేసులో ప్రధాన నిందితుడు బాను అరెష్టు అయ్యాడా..?..భాను అరెష్టులో తిరుగుతున్న కొత్త మలుపులేంటి..?

ఈనిజాన్ని నీవెప్పుడు తెల్సుకుంటావో...?