ఎలా చెప్పాలి చెలియా నీకు
ఈ ఎడబాటు నా ఎదలో గాయమని
ప్రతిరోజూ నువు చేసే ఫోనే
నా ఎద ఎడారిలో ఒయాసిస్ అని
ఈ ఎడబాటు తడబాటు లేకుండా
చెలియా ఎలా చెప్పాలి నీకు
నా మనసు నిన్నటిలా లేదని
ఈ రోజు నా ఆదీనంలో లేనే లేదని
రోజూ మనం ఫోనులో మాట్లాడుకుంటున్నా
నా పెదవులు నీతో ముద్దాడాలని
ఉర్రూతలూగుతున్నాయని
నా కళ్ళు నీ దేహంలో ప్రతి ఆంగులాన్ని
గుచ్చాలని చూస్తున్నాయని
నా చేతులు నిన్ను తీగలా
అల్లుకోవాలని తహతహలాడుతున్నాయని
ఎలా చెప్పాలి చెలియా నీకు
నా మనసు నీ వెంటే ఉన్నదని
నా ఆలోచనలు నీ చుట్టే
పరిబ్రమిస్తున్నాయని
నీ రాక కోసం నేను
వేయు కళ్ళతో ఎదురు చూస్తున్నాని
ఎలా చెప్పాలి చెలియా నీకు
ఎందుకంటే నీకు ప్రపంచంలో
కుట్రలు తెలియవు, కుతంత్రాలు తెలియవు
లౌక్యం తెలెయదు, లాభ, నష్టాలు అంతకన్నా తెలియవు
ప్రపంచమంతా స్వచ్చమైన పాల లాగ