నువ్వై ...నేను
నీవై ...నీలో నేను ఉన్నాను...
నీకై ...నాలో వెతుకుతున్నాను ...
నీలా ఎపుడో నేను మారాను ...
నాలా మారే నిన్ను చూసాను ......
నన్ను తలుచుకుంటుంటే ...నువ్వే గుర్తొస్తున్నావు
నేను లేననుకుంటుంటే ...నువ్వై కనిపిస్తున్నావు
నువ్వు సంతోషం గా ఉంటే ...నేను చిరునవ్వు నవ్వుతున్నాను
నేను బాధపడుతుంటే ...నువ్వు కన్నీరొలుకుతున్నావు
నన్ను అద్దంలో చూసుకుంటుంటే ...నువ్వే కనిపిస్తున్నావు
నిన్ను చూద్దామనుకుంటే ...అద్దంలా నన్ను చూపిస్తున్నావు
నువ్వెవరో, నేనెవరో తెలియకుండా పోయింది .............
"నువ్వు, నేను" గా మనల్ని విడదీయలేనంత ప్రేమా ఇది !!!!!!!!!!