నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక,
మనసు నిండా నింపుకున్న ప్రేమని,తుదిశ్వాసతో వదిలేస్తూ,
ఎవ్వరికైన గాయం ఒక్కసారే తగులుతుంది...
ఆగాయం నేర్పిన అనుభవాలతొ జీవితం ముగుస్తుంది..
ప్రేమ అంటూ ఊరించడం....నిజం ఆనేలా నా మనస్సును నమ్మించడం..
అదేనిజమనుకొని ప్రపంచాన్ని జయించానన్న ఒక్కక్షనం ఆనందంలో..ఓర్వలేని నిజాలు..
అప్పటికే జీవితంలో జీవితాంతం తట్టుకోలేని గాయంతో భాదగా ఉంటే నేనున్నా అంటూ తీయ్యని పలుకరింపు..
అది నిజమో అబద్దమో తేల్చుకోలేని పరిస్థితుల్లో..నిజమే అని చెప్పడం..
అది భ్రమో పరి బ్రమో తేల్సుకునే..అవును నిజమే అని ఓ అందమైన అబద్దం చెప్పడం
అదే నిజం అని పొంగిపొర్లుతున్న ఆనందాన్ని పొందేలోపు..అది పాలపోంగని తేలడం..ఏంటో..
అదేం విచిత్రమో నా కర్మోకాని మద్యా మరొకడి ఎంట్రీ..వాడు..నన్ను తన స్వార్దం కోసం దోషిని చేయడం..
అప్పటిదాకా నమ్మిన ఆమనిషి మరికరిని నమ్మి నన్ను ద్రోహిగా చూడటం..
వాడు జీవితంతో ఆడుకుంటున్నా సైలెంట్ గా చూడటం..మనసులో అగ్గిరాజేస్తుంది..
వీర విజయంతో S.M.S లల్లో... పెట్టి నా మనస్సును ముక్కలు చేసి భాద పెట్టిన విషయాలు నీకెలా చెప్పను..
ఆందుకేనేమో నాకు ప్రపంచం అంటే విరక్తి..మనుషులంటే ..ప్రేమ అంటే కూడా..ఏంటో అన్నీ నాకే జరుగుతాయి
నేను ఎవ్వరిని తప్పు పట్టను ..నామీద నాకే చిరాకు..నేనంటే నాకే కోపం..
ఈ ప్రపంచానికి దూరంగా పారిపోవాలని ఉంది..మనుషులు లేని ఒంటరి ప్రదేశానికి
నాకు నేనే కాలుతున్న శవంలా..తగల పడుతున్న మనిషిలా అనిపిస్తోంది...
గుండెళ్ళో మంటలు అలా అనిపించేలా చేస్తున్నాయి..ఎప్పటికైనా అలా తగల బూడి బూడిద కావల్సిందేకదా..?
నేను బ్రతికుండగానే అలా తగల బడాలన్నంత కోపం నామీద నాకే చిరాకేస్తోంది..
.ఒకటికాదు ప్రతిఘటన ఎదురు తిరుగుతుంటే..ఎన్ని సార్లని చస్తూ బ్రతకాలి...
నీడలా ఎంటాడుతున్న అపజయం.. నాఎదురుగా నావిజయాన్ని మరొకడు ఎత్తుకపోతుంటే..
చేతకాని చావ చచ్చిన మనిషిలా..అలా చూస్తూ ఉండటం ఎంత భాదో గుండె రగులుతోంది
గుండెళ్ళో ఇంత భాధ పెట్టుకొని పైని నవ్వుతూ ఉండటం చాలా కష్టంగా ఉంది....?
చేయని నేరానికి బలికావడం..కన్నీరు ఆగడంలేదు..ఓడీన హ్రుదయం కదా.....
కొన్ని మరువలేని జ్ఞాపకాలు..కన్నీటి పొరను తెప్పిస్తున్నాయి...
ఏంటీ నా ప్రపంచం నీళ్ళతో నిండిందా అనిపిస్తుంది అది కన్నీరుకదా..
.రాత్రులు ఏడ్చి ఏడ్చి.. కన్నీరు అయిపోవడంతో ఇప్పుడు రక్తం వస్తోంది అంటే టైం దగ్గర పడిందన్న మాట..
ఒక్కటి మాత్రం వాస్తవం.. అందరిలో కనిపిస్తూనే..షడన్ గా కనిపించకుండా పోవాలని ఉంది..అది ఎప్పుడో తెలీదు.
తిరిగిచూస్తే నిర్జీవంగా కనిపించే నేను ... నాకెందుకో ఈ ఆలోచన బాగుందనిపిస్తోంది....
.నాకు నేనుగా వేసుకుంటున్న శిక్ష..ఆలొచనే గొప్పగా ఉంది అమలు చేస్తే ఎంత త్రిల్లింగా ఉంటుందో..
ఎప్పటినుంచో పోరాడుతున్న మనస్సాక్షికూడా నీకిదే కరెక్టు..ఆపని చేయమంటోంది ప్రియా