మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.
గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.
క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.
నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.
మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.