Thursday, June 14, 2012
ఇకవేళ నీకు దూరం కావల్సి వస్తే..నీ ఇంట్లో ఫోటోగా మారిపోతా ..నీ ఇంట్లో గోడపై ననేలాడదీయవా ప్రియా
కదిలే నీడల్ని..వాస్తవాలనినమ్మాలి....ఆనిజాలు ఒక్కోసారి..నీడలై నిన్నూరిస్తాయి
అప్పటికీ ఆనీడ నీన్నోడిస్తే అప్పుడు బ్రమగా మారుతుంది..నా మనసు నీదైనప్పుడు
నేను నిజాన్ని అయితే ఎంటి కాకపోతే ఎంటి...నీవన్నది నిజం నేనన్నది అబద్దం
అని నాఉహళ్ళో ఉన్ననిన్ను వాస్తవంలో బ్రమ అని తేలినప్పుడు..నేను బ్రతికున శిల్పంగా మారి
బ్రమల్లో బ్రతుకుతా ఈ బ్రతుకు చిత్రం లో నాదో విచిత్రమై..నేనో చిత్రంగ మారి.. నీతో పూజలందుకుంటా
ఈ కొద్దిపాటి పరిచయంలో నీ ఇంట్లో ఫోటో ఫిక్సై..ప్రతిరోజు నా జ్ఞాపకాలతో నిన్ను పలుకరిస్తా ప్రియా..
ఇకవేళ నీకు దూరం కావల్సి వస్తే నా చివరికోరిక అర్దం అయిందనుకుంటా..
అదే ప్రియా నీ ఇంట్లో ఫోటోగా మారిపోతా ..నీ ఇంట్లో గోడపై ననేలాడదీయవా ప్రియా
నిన్ను చేరుకోలేని క్షనాన ..ప్రియా నిన్ను గెలవలేని క్షనాన.. నా ఆఖరికోరిక తీర్చవా ప్రియా
Labels:
కవితలు