నిన్ను మరిచే మంత్రం ఏదైనా ఉందా ప్రేమ...
పెనం మీద పడ్డ నీటిబొట్లు మాదిరి
నా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేస్తున్నావే నీకిది న్యాయమా...?
నా ఆలోచనలన్నీ ఏ వైపుకు మరల్చిన
అయస్కాంతంలా నీవైపుకు లాగేస్తావ్...
లాగేసిన దానివి నీ.. కౌగిలో..
కాదు.. కాదు.. కనీసం నీ..పిడికిలిలోనైన నను బందిస్తావా....
లేదు నీ దరిదపుల్లోకైన రానీయకుండా దూరంగా..... నేట్టేస్తావ్.
మరుగైన కావు...
మరుపైన రానివు...
ఎందుకీ.... దూరం ?
ఎందుకీ....మౌనం?