జ్ఞాపకాలు మనసును చింద్రంచేస్తాయి.....
మదుర మైన అనుబూతులు గుర్తుకుతెచ్చే జ్ఞాపకాలు ఓసారి గుర్తుకు వస్తే తీయ్యని అనుభూతి..
గతం ఎప్పుడూ తీయగానేఉంటుంది మదుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది కొన్ని జ్ఞాపకలే మనసును చింద్రంచేస్తాయి..
గుర్తుకు రాకూడదు గుర్తుకు తెచ్చుకోకూడదనుకున్నవే మరీ మరీగుర్తుకొచ్చి మనసును ముల్లులా గుచ్చుతుంటాయి..
కాలం కొన్ని జ్ఞాపకాలను మరిపిస్తాయి కాని అవే జ్ఞాపకాలు కొన్ని సంఘటనలతో తిరిగి గుర్తుకొస్తాయి..
గతం వద్దు వద్దు అనుకున్నా ఈ జ్ఞాపకమే గతాన్ని తవ్వి గుర్తుకు తెస్తూంటాయి...
కొన్ని సార్లు అవే జ్ఞాపకాలు మనసులో ఉన్న భాదను దూదిపింజను చేసి మనసుకు ఉల్లాసాన్నిస్తాయి
చిత్ర విచిత్ర మైనా జ్ఞాపకాల దొంతర కదిలి పాత కాలం అనుభూతుల్ని గుర్తుకు తెస్తాయి..
ఒకసారి మెంటల్లీ హేండీ కాప్డ్ మనుషులను చూసినప్పుడు వీరికి గతం ఎప్పటికీ గుర్తుకురాదు కాబట్టే ఇంత హేపీగా ఉన్నరా అనిపిస్తు0ది..
ఏఘటన ఐన గతం గుర్తుకు రాని జ్ఞాపకంలాగా ఉంటేనే బాగుంటుంది..