"..ఏమైందో ఏమో
ఉన్నట్టుండి ఆ చెమ్మగిల్లిన కళ్ళు
అగుపించటం లేదు
ప్రేమ నిండిన ఆ అందమైన కళ్ళు
లోగిల్లై ..వాకిల్లుగా మారి పోయిన చోట
దేని కోసమో వెదుకుతున్నట్టు
ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టు
అలుపు సొలుపు లేకుండా
వెంబడించినట్టు అనిపించింది
అయినా మనకు తెలియకుండా
మనల్ని మరొకరు చూడటం ఎంత బావుంటుందో
అదో స్మరనీయమైన సన్నివేశం
అదో మోహావేశపు ఆలింగనం
మనం అనుకుంటాము కానీ
కొన్ని వేల కళ్ళు
మనల్ని నిశితంగా గమనిస్తుంటాయి
గుండెలను గుచ్చుకునేలా చేస్తూనే ఉంటాయి
నడిచినా ..సంచారం చేసినా
లోకాన్ని స్పృశించినా
నిదురలోకి జారుకున్నా
ఆ కళ్ళు మాత్రం కలలో కూడా
కమ్మని కబుర్లు చెబుతాయి
హృదయపు సముద్రం మీద
అలల సంతాలు చేస్తాయి
గోదావరిగా మారిన
గుండెల మీద వాలిపోతాయి
మరిచిపోని సంతకాలు చేస్తాయి