ప్రేమ స్నేహం నిజం అని నమ్ముతాం ఎందుకో ఒక్కోసారి స్వార్దం చూసుకొని మనసుల్ని మోసం చేస్తారు..ఎందుకు అలా చేస్తారో తెలీదు...ఎలా మోసం చేయాలని పిస్తుందో తెలీదు ..ఒకప్పుడూ ఇష్టపడ్డ మనిషి ఎంత భాదపడుతున్నా పట్టీంచుకోరు వారికి కావలసింది వారి సంతోషం అంతే ఎదుటివాడు ఏమైనా తనకి పట్టదు..గతంలో ఏం జరగనట్టు హేపీగా లైఫ్ ఎంజాయి చేస్తుంది ...ఇలా ఎందుకు చేస్తుందో నిలదీయలేక గతం లో ఎందుకు నన్ను ఇష్టపడి ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నావు అని అడుగలేక ప్రతి క్షనం ప్రతినిమిషం గుర్తుకు వచ్చి వేదిన్న జ్ఞాపకాలకు మర్చిపోలేక మదన పడుతున్న మనసును ఎప్పుడు అర్దం చేసుకుంటుందో కదా..? ఇలా ఎలా ఉండ గలుకుతున్నావని తనకు తాను ఎప్పుడైనా ప్రశ్నించుకుందా ఉంటే ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తుంది... మనస్సు చచ్చిన మనిషిలా..ఈ పాటలో కొత్తగా ప్రేమించుకునే ప్రేమికులు ఎంత ఆనందంగా ఉంటారో అన్నట్టు ఉంటుంది ఇది శాశ్వితం అనుకుంటా కాదు కదా...చివరకు నా సెల్ నెంబర్ ను బ్లాక్ చేశావు నీకు మనస్సెలా ఒప్పింది... అంతగా ఎలా ఉండ గలుగుతున్నావు .. నీవు ..?
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకుఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా ....అప్పుడు ఉన్న సెల్పోన్ రింగ్ టోన్ మార్చినట్టు , మనిషి మనసును మార్చారు జాలి అనేది లేకుండా మనసుల్ని మనుషుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నికేంటి ..సెల్పోన్ రింగ్ టోన్ మార్చావు కదా...ఆ పాత పాట గుర్తుందా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి ఆ రిగ్ టోన్ మార్చావు కదా...?...నీకు నేనే గుర్తులేనప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుంచుకునేంత గా ఉన్నావా చాలా మారిపోయావు ఇలా మారతావని కలలో కూడా ఊహించలేదు... అసలు ఇప్పుడు ఉన్నది నీవేనా ఎందుకిలా చేస్తున్నావు ..నీ ర్తుగా ఈ పాటను ఎప్పుడూ వింటున్నా..అంతకు మించి ఏంచేయలేను ... ఎందుకిలా నన్ను మోసం చేశావు .. చూస్తున్నా .. అన్నీ వింటున్నా నీవు హేపీగా ఉన్నావు.. అంతకు ముందుకంటే ఇంకా లైఫ్ ఎంజాయి చేస్తున్నావు నీవు నాకు ఏమీ తెలియవు అనుకుంటున్నావు అన్నీ తెల్సుకుంటున్నా కాని ఏం చేయగలను గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండేలు పగిలేలా భాద పడటం తప్ప త్వరలో ఓ నిజం తెలుస్తుంది ఆ నిజం నిన్ను కాల్చి వేస్తుంది... జీవితంలో ఎందుకు ఈ తప్పు చేశానా అని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా నీవూ చూడు ...ఎవరు నిజమో ఎవరు అబద్దమో తేలుతుంది... నీవిప్పుడు నమ్మిన ఎంజాయ్ చేస్తున్న వాటితో నీవు ఎమౌతావో చూడు అది చూడలేను ...అప్పటిదాకా నేను ఉండాలిగా ..
ఒకప్పటి నీ రింగ్ టోన్ పాట లో మీనింగ్ చూడు కావాలంటే ఆ వీడియో చూడు .. మనసు చచ్చిన మనిషివి నీకివి ఎందుపడతాయిలే
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నాకోసమే చినుకై కరిగి . ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాల ...బహుమతి కాదా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు...లల లల లలలాల
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీచూపులే తడిమే వరకు ..ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచి తరుణం వరకు..
ఎదురుగ నడచే తొలి ఆశలకు...లల లల లలలాల
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల