Friday, June 22, 2012
మాటలకి అందని మరెన్నో భావాలని .మరిచిపోకుండా చూడు
నిత్యం నువ్వు నా వేంటేవున్నావు
నమ్మటం లేదా..?
కావాలంటే..ఒకసారి
కనులు మూసుకోని..మౌనంగా మనసుతో
చూడూ నావైపు...ప్రేమగా మాట్లాడుతూ...?
పసిపాపలా నవ్వుతూ...?
గిలిగింతలు పెడుతూ...
గొడవపడతూ....అమాయకంగా ...
అలకబూనుతూ..అమాయకంగా
ఆడుతూ ఆడూతూ..అలసి నా గుండేపై వాలి
సేదతిరుతున్నావు...
కనిపించావా? ..ఇంకా కనిపించలేదా.....!
అయితే..నీ రూపాన్నే నింపుపుకున్న
కనుపాపని కళ్ళారా చూడు
నీ పేరే గుండే చప్పుడుచేసుకున్న
తీరుని మనసార విను
నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు....
మాటలకి అందని మరెన్నో భావాలనిమాటలు ఇక్కడ పేర్చను..మరిచిపోకుండా చూడు
నీ మనసుకి నువ్వు ఖచ్చితంగా కనిపిస్తావు...
నీపై పెంచుకున్న ప్రేమ తప్పకుండా కనిపిస్తూంది...
Labels:
కవితలు