Monday, June 18, 2012
ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..
నువ్వు రాబోతున్నప్పుడు నేనెదురు చూసిన ప్రతి నిమిషం గంటగా మారి నన్నెంతగా బాధించిందో
ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..ప్రియా
నీతో గంభీరంగా ఉండాలనుకుంటానా !!? నిన్ను చేరేవరకే అది....
నాలుగు రోజులుగా కొమ్మ చివరన నిబ్బరంగా ఉన్న గులాబీని ప్రేమతో సున్నితంగా తాకీ తాకగానే జల జలమంటూ రాలే రేకుల్లా ...
నిన్ను చూస్తే చాలు ఉరకలు వేసే హృదయాన్ని మభ్యపెట్టడానికి ఆ దిక్కో ఈ దిక్కో చూపిస్తున్నా...ప్రియా
నువ్వున్నప్పుడు ఎన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయానో నువ్వెళ్ళిపోతున్నావంటే మరెన్నో చెప్పాలనున్నా... మౌనంగా చూస్తున్నా,,,ప్రియా
నువ్వు మాత్రం నన్నే చూస్తూ .. ఈ కొద్ది క్షణాలైనా కళ్ళనిండా చూసుకోవాలన్నట్టు ...
నిజమే కదా! కొన్ని రోజులైతే నువ్వు నా పక్కనుండవు...ప్రియా
కానీ.. ఎలా..? నిన్ను ఇలా చూస్తానా... అలా ..... మనసు భారంగా మారిపోతోంది ..
తన గుండె చప్పుడు వినిపించాలని విశ్వప్రయత్నం చేస్తుంది.ప్రియా
నువ్వెళ్ళిపోయిన క్షణం .. అప్పటి వరకు నువ్విక్కడే.. నా పక్కనే ... కానీ ఆ పైన నేనొక్కడినే....ప్రియా
ప్రేమలో నీకు నా వీడ్కోలు నా మనసుకి అనారోగ్యం...తట్టుకోవడానికి తగ్గడానికి కాలమే ఔషధం.....ప్రియా
నీ జ్ఞాపకాలైనా ... నన్ను ఓదారుస్తాయనుకుంటే.. అవి కూడా నిర్దయగా నే మోయలేని బరువై మదిలో చేరి ..
నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీతో చేతల్ని, గుర్తు చేస్తూ..
నువ్వు లేనితనాన్ని గుచ్చి గుచ్చి చూపిస్తున్నాయి..ప్రియా
తీపి జ్ఞాపకాలని.... ఒంటరితనంతో పోలుస్తూ.... వాటిని చేదుగా మార్చే వీడ్కోలు భారాన్ని నే తట్టుకోగలనా!ప్రియా
Labels:
కవితలు