సూర్యుడు జాలిగా జారుకునే వేళ
ఆ ఎరుపును దోచుకున్న కన్నులు
ఏదో తెలియని మెరుపును వెత్కుతుంటే
నను చూడమంటూ ఒక నీటి బుడగ కను తాకితే
చప్పున మూసితి రెప్ప నవనీత శిల్ప హస్తము తలను తాకి
చిరుగాలి ఊపినంత ఎడమ కన్ను తెరిచి చూచితిని
ఎదుట ఉన్న పాలమేని పడతిని ..
అంతా నిశ్శబ్దము ఆ కాంతతో ఏకాంతము
ఎరుగదే ఈ చిత్రము ముందెన్నడూ నా హృదయము ..
క్షమించు.. అంటూ ఓ పదము
తీయగా పలికే ఆ అందము
మనసారా నువ్వే నాలో సగము
అని బదులు తెలిపే నా హృదయము ..
అరె పడమటి దిక్కున సూర్యుని తూర్పు
వేకువలా క్రొత్తగా కాంచేన్ కన్నులు పున్నమి
వెన్నెల నింగిలో ప్రతి రోజూ కాసెను వింతగా
నా చెలి నవ్వినంతగా
వసంత రుతువులో తరువులా
చిగురులు వేసే ప్రేమ గుండె నిండుగా .....