Friday, June 15, 2012
యుద్ధం తెలియని మీ మనసుకి...నేనొక విరహాన్ని,
వెనుకంతా గతం వెళ్లి వెతికితే
చరితైతే అంతా చెదలుంటే వృధా
జ్ఞాపకాల మధురం గాయాల విస్మయం
వెనుదిరగకు నీవు సుమా అది జ్ఞాపకమైనా విస్మయమైనా
నీ కళ్ళ ముందుంది కాంతి
నీ కాళ్ళ ముందుంది నేనొక ఆశావాదిని,
మీకు కనిపించని నిరాశావాదిని.
నేనొక ఒంటరిని,
నేనొక అగ్నిశిఖని,మీకు కనిపించే ఆరిన భస్మాన్ని.
నేనొక రగిలే రవిని,
మీకు కనిపించే నవ్వలేని వెన్నలని.
నేనొక అర్థంకాని పుస్తకాన్ని,
చదవని మీ కళ్ళకి.
మీ నిశ్శబ్దపు ప్రపంచానికి.
నేనొక సమరాన్ని,
యుద్ధం తెలియని మీ మనసుకి.
నేనొక విరహాన్ని,
మీరనుకునే ప్రేమికున్ని.
నేనొక స్వార్థాన్ని,
మీ నుండి నేను అనుకునే భావానికి.......
నా చితిలో భస్మాన్ని ఆర్పలేవు.
నా సమాధిపైన ధూళిని చెరపలేవు.
నీకు ఆ అర్హత లేదు.
విరహపు ఎడారి యాతనలో నేనున్నాను.
నీ ప్రేమ దీపాన్ని ఆర్పివేసావ్... కానీ
నా జీవనజ్యోతిని వెలిగించావ్ కవితవై, పాటవై, నేను రాసే కథవై....
నా చితిలోని భస్మాన్ని ఆర్పలేవు.
నా సమాధిపై ధూళిని చెరపలేవు.
Labels:
కవితలు