Saturday, June 16, 2012
కలలు కన్న నా కనులకేం తెలుసు..ప్రియా.. కన్నీరు కార్చడం తప్ప..
నీ చెక్కిళ్ళను నా దోసిటితో అందుకొని....ప్రియా
ముడుచుకుని చిరునవ్వులు చిందిచే నీ పెదవులను దాటి..
సిగ్గులొలికే నీ కలువకన్నుల మెరుపులు నావనే బ్రమల్లోనే బ్రతుకుతున్నా ప్రియా
.నేను పడుతున్న వేదనంత నేనను భవిస్తా కోరుకుంటా ప్రియా
ఆనందం నీతో ఎల్లపుడూ వుండలని. కోరుకుంటా ప్రియా.
నా అలోచనలలో నీవు వున్నట్లుగా.. సిరిసంపదలు నీతో వుండాలని...
ప్రపంచలోని ఆనందం నీసొంతం కావాలి ప్రియా..నీపెదాల పై చిరునప్పు చెరగనీయకు ప్రియతమా
నాకు లేని ఆయుష్యు, ఆరోగ్యం ఆ భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటూ...
కలలు కన్న నా కనులకేం తెలుసు..ప్రియా.. కన్నీరు కార్చడం తప్ప..
నీపై మనసుపడ్డ నా హ్రుదయానికేం తెలుసు.. నిను ప్రేమించడం తప్ప ..ప్రియా
అవదులు దాటిన ఆందోళన నన్ను విచక్షన లేనివాడిని చేసి..నన్నోడేలా చేస్తుంది ప్రియా
ప్రతినిమిషం నిన్నే తలస్తూ..నీ నామాన్నే పరితపిస్తూ ప్రియా..ఇలా నేనేమైపోతానో నీవు కాదంటే,
Labels:
కవితలు