అదేంటో...ప్రియా
నాభి నుండి గుండె దాకా...ప్రియా
సర్రున ఎగబాకుతుంది.
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా..
చేతికి చిక్కదు
పట్టు వదలదు
ఎటు నుంచి ఎటు పాకుతుందో
మెలిపెడుతుంది దేహాన్ని..
అదేంటో....ప్రియా
ఎంత తడిపిన తడవని పెదాలు..ప్రియా
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...ప్రియా
అదేంటో...
ఏదో భారాన్ని మోస్తున్నట్టు ప్రియా
ఎపుడుగుండెలపై వాలిపోదామా అనుకునే కళ్ళు
నీ నులి వెచ్చని కౌగిలో చేరాలనే తహ తహ ప్రియా
మన్మదుడు వేసిన బానాలు గుడేళ్ళో రేపే అలజడి మరి తప్పుతుందా...
శివపార్వతులకే మన్మదుని బాణాలు తప్పించుకొలేక పోయారు మనమెంత ప్రియా