ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦
సన్నివేశ పునరావృత పర౦పరలో
గొ౦తెత్తి ప్రశ్ని౦చే స౦దర్భము౦డదు
ఋతువులు భ్రమణసూత్రాన్ని వల్లిస్తూ
ఎదురుచూపుల నమ్మక౦పై
ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి
ఉదయాలు గాయపడకు౦డా అడ్డుకోలేవు
ఏ రాత్రీ గాయానికి పూతమ౦దు కాలేదు
ప్రతిరోజూ ఇదే అనుభవ౦
పాత గాయాలను ఓదార్చుకు౦టూ వెళ్ళి
మళ్ళీ పొద్దువాలేలోపు గాయపడట౦
రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడ౦..