మరపురాని తలపుల అలఝడులు,
వెంటాడుతూ వేటాడే జ్ఞాపకాలు,
నా హ్రుదయాంతరాలను కల్లోల పెడుతుంటే...
మానుతున్న గాయం తిరిగి రేగి,
కంటికి నీరు కరువై రక్తాశృవులు చిందిస్తూ..
గొంతుకు గానం బరువై మౌనంగా రోదిస్తూ...
విల విల లాడే నా ప్రాణం పరిహసిస్తూ..
అంటోందీ...
ముఖానికి చిరునవ్వు పరదా కప్పుకుని,
మనసుకి మౌనంతో సంకెళ్ళు వేసుకుని,
నీ నీడ కూడా చేరలేనంత దూరమై,
తన వునికిని తెలువనీక, తనలోకంలో విహరించే నీ చెలి కోసమా!