ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళలో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడుతో యుధ్ధ౦ చేస్తో౦ది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే...
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను
ఓ నిరాశా...ఈ రాత్రి మాత్రమే నీది
ప్రతిరాత్రి నిరాశనాదే..ఆశనిరాశగా మారింది.
గతాన్ని తెచ్చుకోలేను ..ప్రస్తుతాన్ని నమ్మలేను
ఆగతం దేవుడిచ్చాడని సంతోషించా..ఈ ప్రస్తుతం దేవుని శిక్షేనేమో కదా..