Monday, June 11, 2012
నేను నా మనసాక్షి.." నాకీ ప్రపంచం వద్దు..?"
ప్రతిసారి నాకు మనస్సాక్షికి గొడవ జరుగుతూనే ఉంది...ఎందుకోతెలిదు ఇద్దరికి ఒక్కక్షనం పడదు.. నేనేం చేసినా తప్పు పడుతోందొ నా మనస్సాక్షి..సమాజంలో నీలాంటి వాడు బ్రతకలేడు... మరీ ఇలా ఉండకూడదని చెబుతొంది బ్రతకడం నేర్చుకోవాలంట .. నా మస్సాక్షికి నాకు ఎందుకు పడటంలేదో చూడండి
నేను :- నేను ఎప్పుడూ తప్పు చేయలేదు అమె కోసం నా సంతోషాన్ని కాదనుకున్నా..అయినా ఎందుకు చేసిందో ఎలా చేసిందో తెలీదు మరొకరి వంచన చేరి నన్ను దోషిని చేసింది తను హేపీగా ఉండటంకోసం నాసంతోషాన్ని దిగమింగుకొని తను అనుకున్నదే జరగాలనుకున్నాకాని చివరికి ..మరొకరి సమక్షంలో దాడిచేసింది..మనసు గాయపర్చింది..చివరకు అనకూడని మాటలు అంది..ఎందుకలాచేసింది
నా మనస్సాక్షి :- అప్పుడు అలా అనిపించి నీతో స్నేహం చేసింది..ఇప్పుడు అలా అనిపించలేదు...నీవు నచ్చలేదు అందుకే ఇలా చేస్తుంది అయితే..అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేయాలా...నిజాయితీ గా ఎవడు ఏడ్వమన్నాడు..నటించాలి..వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలి నీకు అది చేతకానప్పుడు ఆలోచించంకు ...నీకు ఏదుటి వాడి అవసరాన్ని బట్టి నడచుకోవడం చేతకాదు..
నేను :- అందరూ ఒకేలాగ చేస్తున్నారు.. నాకు స్వార్దం ఎక్కువ నా ప్రెండ్స్ నాకే అని, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాను ..ఎందుకో ఇలా దూరం అవుతారు,..కారణం తెలీదు..ఒక్కోసారి ఈ ప్రపంచంలో మనుషులు నాకొద్దు..అందరికి దూరంగా పారిపోవాలని పిస్తోంది..ఒక్కోసారి చనిపోవాలని పిస్తుంది..?
నా మనస్సాక్షి :- ఆపని చెయ్యరా బాబు నీ మనస్సాక్షిగా ఉడటంకంటే హాహిగా గాళ్ళో కల్సిపోవడం బెటర్ అని ఎన్ని సార్లు అనుకున్నానో ఎందుకంటే నీకు బ్రతకడం చేతకాదు..అన్నీ నీవనుకున్నట్టు జరగవు ..అందరు పోయే దారిలో పోవాలి నీకు నీవుగా గిరిగీసుకొని ఇదే ప్రపచం అనుకుంటే ఎలా..అందుకే నీవు బ్రతకడం వేష్టు ...నీవు బ్రతికి ఇలా ప్రతిక్షనం నన్ను వేదించకు చచ్చిపో
Labels:
జరిగిన కధలు