Saturday, June 2, 2012
నువ్వు కరునించక పోయినా ..నువ్వు చీత్కారించినా
"ఒంటరితనం కమ్ముకున్నప్పుడు
గుండె పచ్చి పుండుగా మారినప్పుడు
వేదన నిశీదిని ఆక్రమించినప్పుడు
హృదయాన్ని నువ్వు తీరని గాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ...
నేను కోలుకోలేక పోయా ...
ఇది నన్ను మరింత భాదపడేలా చేసింది
అప్పుడు నన్ను ఓదార్చే వారు కరువయ్యారు ..
కన్నీళ్ళే నాకు స్వాంతన కలిగించేలా చేశాయి
ఎవరైనా..ఎప్పుడైనా సంతోషాన్ని భరిస్తారు ...కానీ ..
దుఖాన్ని భారించాలంటే మాత్రం వెనుకంజ వేస్తారు
బంధాలు..అనుభందాలు అన్నీ మాయమై..
కాసింత ప్రేమ కోసం..చల్లని ఒడిలో సేద దీరే సదవకాశం కోసం
ఎదురు చూడటం ..ప్రతి రోజూ అలవాటుగా మారిపోయింది ..
ఇప్పుడు నిర్మలమైన ప్రేమ దొరకాలంటే
మరిన్ని జన్మల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది
బహుశా.. నవ్వులు కరువైన చోట ..నెలవులు లేని చోట ...
అనుభవం వెతుక్కోవటం అంటే .. గాలిలో దీపాన్ని వెలిగించటమే ..
రెండే రెండు గుండెల మధ్య చెలరేగిన భావాల దొంతరలు
ఇప్పుడు మళ్ళీ మొలకెత్తుతున్నాయి ..
ఇది తప్పో ...మరి ఒప్పో తెలియదు కానీ ..
నువ్వు కరునించక పోయినా ..నువ్వు చీత్కారించినా
నిన్నే కోరుకుంటోంది నా మనస్సు..
ఇది నా తప్పు ఎలా అవుతుంది చెప్పు ."
Labels:
కవితలు