Wednesday, June 6, 2012
నీజ్ఞాపకాలు గుండెను కత్తితో చిందరవందరగా చీల్చిన ఫీలింగ్..
నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అఅపరిచితుడిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి
ప్రతిక్షనం నిజ్ఞాపకాలు వెంటాడుతున్నాయి..
గుండే బరువెక్కుతోంది నీవెక్కడున్నావంటూ..
పనిలో కాస్త రిలాక్స్ అయితే ఎందుకో నీజ్ఞాపకాలే వెంటాడుతున్నాయి..
గతంతాలూకా దూరం ఎప్పుడు దగ్గవుతుందాని..?
గతం ఎప్పటికీ తిరిగిరాదా...ప్రస్తుతం ఆగిపోదా..
నీ ఆలోచనలతొ గుండె వేగం పెరుగుతుందేగాని..
ప్రతిక్షనం నీజ్ఞాపకాల్లో..ఎక్కడున్నావో ఇప్పుడేమి చేస్తున్నావంటూ ఆలోచనలే..
గుర్తుకొస్తున్న పాతజ్ఞాపకాల దోంతరలో...అన్నీ నిజాలా అని నమ్మలేకున్నా మిత్రమా..?
నీజ్ఞాపకాలు గుండెను కత్తితో చిందరవందరగా చీల్చిన ఫీలింగ్..
నీ ఆలోచనలు వచ్చిన క్షనం పెరుతున్న గుండే వేగం ఆగిపోతే బాగుండన్న ఫీలింగ్
Labels:
కవితలు