మనసు అంతరంగాళ్ళో అలజడి అలజడి...ఏదో జరుగుతోంది..
మనసా మాయచేయకే..నెనెవరిని ...ఎందుకో ఈ ఆందోళన..నేను ఎమైపోతున్నానో..
మదిలో ఆలోచలన తరంగాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి...ఊపిరి ఆగిపోతుందేమో..
నాకే ఇలా ఎందుకు జరుగుతోంది ప్రియా నేనే ఎందుకిలా అవుతున్నానో తెలీదు..
మనసును కలచి వేస్తున్న ఘటనల్లో..గుండెళ్ళో గుచ్చుకుంటున్న జ్ఞాపకాల ముళ్ళు భాదపెడుతున్నాయి ప్రియా..
నన్ను నన్నుగా నిలువనీయని జ్ఞాపకాలు...ఎందుకో బయపెడుతున్నాయి..
నేనో స్వార్దజీవిని నా అనుకున్నవాళ్ళూ నాకేసొంతం అని మరి..ఏం జరుగుతోంది..
ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా నీడలా నన్ను వెంటాడుతున్న జ్ఞపకాలు..
నీడ వెలుతురులోనే వెంటాడుతుందేమో కాని నీజ్ఞాపకాలు..గుండెళ్ళో గురిచూసి గుచ్చుకుంటున్నాయి..
నిద్రలో కలవరింతలు..కలల్లో ఉలిక్కిపడుతూ..గుండేల్లో వెతుక్కుంటున్నా..వున్నావా లేవాని
ప్రియా నా గుండెను తడిమి చూసుకుంటే హాయిగా నాంగుండెళ్ళీ నిద్రపోతున్నా .
ఈ ఉలిక్కిపాటు కలవరింతలెందుకు ప్రియా... నీవు నాగుండెళ్ళో నిద్రపోతున్నా.. ఎందుకీ కలవరింతలు ప్రియా..
జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ పోతూ ఉంటే ప్రతి ఘడియలో నీవే ఉంటున్నావు ప్రియా..
నీమీద మోపలేనంత ప్రేమ రాపిడి గుండెను పిండి చేస్తుంటే.. కలుక్కు మంటున్న మనస్సు..
నీ సుతిమెత్తని మాటలు... తీయని స్వరం.. నన్ను పిచ్చివాన్ని చేస్తుంది ప్రియా...
ఆమాటలు దూరమైనక్షనాన నేను బ్రతికి ఉన్న శవాన్ని ప్రియా ..
ఇంతకీ నేను బ్రతికి ఉన్నానా లేదా అర్దం కావడంలేదు ప్రియా..
.ఎందుకో నా చివరిస్వాస.. నీ చల్లని చూపుకోసం ..తీయ్యని మాటకోసం పరితపిస్తోంది ప్రియా