ప్లీజ్ ఒక్కరోజన్నా నన్ను గెలిపించవా...? నాకు ఓడిపోవాలని లేదు
అందర్ని గెలిపించావు ..వాళ్ళ కోసం నన్ను దారుణంగా ఓడించావు..?
వాళ్ళ కు ఏవిషయంలో నేను తీసిపోను..అయినా ఓడించావు
ప్లీజ్ నాకు ఓడిపోవాలని లేదు.. గెలిపించవా..ఒకే ఒక్కరోజు
వాళ్ళు విజయ గర్వంతో నావైపు చూసిన చూపులు తట్టుకోలేకున్నా
వాళ్ళ లా నేను ఇంప్రస్ చేసేలా మాయచేయడం చేతకాదు..ప్లీజ్
నాకు ఓడిపోవాలని లేదు ..కాని ఏన్నో సార్లు వాళ్ళ ఎదురుగా ఓడించావు
అప్పుడే అర్దం అయింది నేనేంటో నీమనసులో ..అది నీమనసులో నాచోటు అని అర్దం అయిందిలే
ఒక్కరోజు కాకపోయినా కనీసం ఒక్క క్షనం అయినా నన్ను గెలిపిచవా..?
కాని తెలుసా నీవు గెలిపిస్తావన్న నమ్మకంలేదు.. జరిగింది తలచుకొంటే
జరిగిన జరుగుతున ప్రతివిషయం జ్ఞాపకాలుగా గుండెను కోస్తున్నాయి
మరి గతంలో జరిగినవి నీవు నాతో అన్నవి నిజాలు కావా..?
....రెస్పెక్టు ..ప్రేమ..ఇవన్నీ ఇప్పటికీ నిజాలే అనుకుంటున్నా..
చాలా మందిని చుశా ..తన కిష్టమైన వాళ్ళు బాదపడుతుంటే తట్టుకోలేరు
మరి నీవెందుకు నా విషయంలో ఇంత దారుణంగా ఉన్నావు చెప్పు..
గతం రీళ్ళ లా ప్రతిక్షనం గుర్తుకొస్తూనే ఉంది..నన్ను భాదపెడుతూనే ఉంది
....నిద్రలేని రాత్రుళ్ళు అలవాటు చేసి నీవు హేపీగా ఎంజాయి చేస్తున్నావు..
అయినా ఏంటో ఒకే ఒక్క క్షనం గెలిపించవా అని అడిగే అక్కు కుడా నాకు లేదేమో కదా..?