వెన్నెల రాత్రుల్లో
వెండి సంతకం
గుండె గొంతుకలో
కదలాడే జ్ఞాపకం
లోకాన్ని ముద్దాడే రాగామది
అనురాగమది..హృదిని మేల్కొల్పే గానమది..
పాటంటే .. సమస్త ప్రపంచం తనలో తాను ఆవిష్కరించడం
పాట లేకుండా నేనుండలేను
పాట లేని జీవితాన్ని నేను తట్టుకోలేను
మరణపు లోగిళ్ళలో పాట పురుడు పోసుకోవాలి
మళ్ళీ జీవం పోయాలి ...అందుకే
పాటకు వందనం ..అభివందనం
సుతిమెత్తని ఆ గొంతు
హృదయపు తోటలో
పూల రాగాలు చల్లుతుంది
నిదురపోతున్న గుండెను
ఉదయమై మేల్కొల్పుతుంది
నిశీధి రాతిరిలో
మనసు ఒంటరిదైతే
అప్పుడు గీతా మాధుర్యం
వెన్నెల చినుకై
పాటల జలపాతంలో
మనల్ని నిండారా
అభ్యంగన స్నానం చేయిస్తుంది ...
-Basker