ఏది నిజం ఏది అబద్దం..?
చేయని నేరానికి ..నేరస్తుడిగా ముద్రపడటం ఓ చేదు నిజం..
ప్రాణంకంటే ఇష్టపడ్డ మనిషి నమ్మడం ..అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా
ఎవరి వద్దైతే ఆనిజాన్ని నమ్మకూడాదో అతని తోకల్సి ..దాడిచేయడం
ఒకప్పుడు నిన్ను నమ్మడం అంటే .నన్ను నేను నమ్మడం అన్ని మనిషి
అతను చెప్పింది నమ్మి ఒక్కసారిగా మనసు మార్చుకొని..దూరం అవ్వడం
ఒకప్పుడు చిన్న విషయాలకే భాద పడతాడని తెల్సి భాదపెట్టకుండా జాగ్రత్తగా చూసుకొన్న మనిషి
చిన్న పిల్లాడిలా నిజాయితీగా స్నేహం చేసిన మనిషి..ప్రేమిస్తున్నా అని చెప్పిన మనిషి
నీవు బ్రతికితే నాకేంటి చచ్చి పోతే నాకేంటీ అని ఓ రాత్రి ఫోన్ చేసి దారుణంగా మాట్లాడితే
తట్టుకొవడం సాద్యం అవుతుందా చెప్పండి..అందుకే..?
గతాన్ని మర్చి పోలేక ..నిజాన్ని ఒప్పుకోలేక ...ప్రస్తుతాన్ని చూసి తట్టుకోలేక..
మనిషిగా ఎప్పుడో చచ్చిపోయా .. ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని
ఓ మనిషిని చంపేయాల్సిన అవసరంలేదు ఇలా చేసినా చంపేసిన దానికంటే ఎక్కువ కదా..?