ఎక్కడో మినుగు మినుగు మంటున్న ఆశ చచ్చిపోయింది..
నీమీద నమ్మకం నామీద నాకున్న నమ్మకం అన్న మాటలు నిజంకాదా..
అప్పుడు నీవు అన్నవన్నీ అబద్దాలే...అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
ఆ నమ్మకం కాలిపోయింది..మనుషులు ఇలాకూడా మారతారా ..?
జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా..కన్నీటి పొర నన్ను ఇబ్బంది పెడుతోంది
అయినా నా పిచ్చికాని నీవు అప్పటి మనిషివని ఇంకా నమ్ముతున్నా అది పిచ్చేకదా..?
ఎందుకు అర్దంచేసుకునే ప్రయత్నం చేయవో తెలీదు..అర్దం చేసుకుంటావన్న నమ్మకం కూడా లేదులే
ఓ నిజం నిప్పులా కళ్ళముందే కాలిపోతోంది..ఆర్పేప్రయత్నం చేయాలని ఉన్నా..?
ఆమంటల్లో అది తగల బడనీ...పూర్తిగా కాలి బూడిదైనా ..నీకేంటీ..
గుండె మండుతోంది..నిజం లా ..కాని ఏదో చెయ్యాలని ఆరాటం ..కాని
ఏమైనా చేయగలను కాని ..ఏమీ చేయలేని నిస్సహాయున్ని చేసి ఆనందిస్తున్నావు
నన్నో వెర్రివాన్ని చేసి వారు విజయగర్వంతో ..వద్దులే చెప్పినా అర్దం చేసుకోలేవు
నీవు అర్దం చేసుకుంటావన్న నమ్మకం లేదు..ఆ అవసరంకూడా లేదు నీకు..
ఇంకా నీవు మారావని మారతావని ..అప్పుడు జరిగినవని నిజాలని ఇంకా నమ్మటం నా..పిచ్చి. కదా..?