ఒకప్పుడు నిన్ను చూడాలని కోటి ఆశలతో కలలు కన్న కన్నులు....
నువ్వు కనపడాలని పడిగాపుల కాపు కాసిన కన్నులు....
నిన్ను చూడగానే కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కన్నులు....
నీ రూప లావణ్యాన్ని తమ చూపిలలో బందీలు చేసిన కన్నులు....
ఇప్పుడు నువ్వు తమ కంట పడకూడదని కోరుకుంటున్నాయి....
నువ్వు ఎదురైతే సిగ్గుతో కన్నులు బరువెక్కి వాలిపోతున్నాయి.. ఎందుకో తెలుసా....?
నిన్ను నిన్నుగా చూడాలని కోరుకొనే కన్నులకు ఇప్పుడు నువ్వు లేవు....
నిన్ను నిన్నుగా ఆరాధించిన కన్నులకు ఇప్పుడు నువ్వు కత్తగా కనిపిస్తున్నావు....
పూర్తిగా మారిపోయిన నిన్ను ఇలా చూడలేక కను రెప్పలు బాధతో వాలిపోతున్నాయి....
విరక్తిగా మారిపోయిన కలలు నిన్ను కనలేక కన్నీరుగా మారి కరిగిపోతున్నాయి.