ఎవరిని నేను ?
నీకు మనసు వుందని ఊహించు కున్నాను...
అది స్నేహానికి స్పందిస్తుందని తలచాను ...
ఆస్నేహం నా ఒక్కడి సొంతం అని బ్రమ పడ్డాను
అది నిజంకాదని తెల్సి నప్పుడు నీరస పడ్డాను
నాలో నీవు స్నేహాన్ని చూసావు అని అనుకున్నాను....
నాతో నీవు అన్న ప్రేమ ,రెస్పెక్టు...అన్ని నిజమనుకున్నా
నాతో ఇలాగే వుంటావని ఊహించుకున్నాను
ఎవ్వడు వచ్చి చెప్పినా నమ్మవులే అని తలచాను
వాడి స్వార్దం కోసం చెప్పిన మాటలు ఎలా నమ్మావో తెలీదు
నాతో నీవన్న ప్రేమకేవలం ఒ ఆట అని వుహించలేక పోయాను ...
మనసుని పరీక్షించే ఈ లోకాన్ని మరిచి స్నేహ హస్తాన్ని అందుకున్నానని ఆనందించాను ...
మోసాన్ని చూసాను...
మనసుని దారుణంగా చంపేశావు...
మౌనంగా మిగిలాను...
దూరం గా వెళుతున్నాను......
ఎక్కడికో తెలీదు....
ఎంత దూరమో తెలీదు....
నీవు నిజం తెల్సుకుని నాకోసం ఎదురు చూస్తేకానరానంత దూరం వెలుతున్నా