కొన్ని నిద్ర లేని రాత్రుల్లో మేల్కొన్న ఆక్రోశం లో ..
కొన్ని అర్ధం లేని పనులు వెతికే వెర్రి తనం లో .....
కొన్ని భావోద్వేగాలు అదుపు తప్పిన ఉన్మాదం లో ..
కొన్ని తీరని కోరికల ఫిర్యాదుల ఆక్రందనలో .....
కొన్ని గుండె చప్పుళ్ళు మొరాయించిన నిస్సత్తువ లో .....
కొన్ని నరాలు తెగే ఉత్కంట రక్త పీడనాలలో ......
కొన్ని శ్వాసలు జీవనాధరాలవ్వని అయిష్టతలో ......
కొన్ని ఆశలు వెక్కిరించిన అసహాయతలో .....
కొన్ని నిరాశలు ఆశ్రయమిచ్చిన అగాదాలలో .....
కొన్ని స్వేద బిందువులు సేద తీరే అలసటలలో