ముళ్ళున్న రహదారిలో
మువ్వలా వాలిపోయావు
కమ్ముకున్న కళ్ళకు
కమ్మని ఊసులు చెప్పావు
దారి తెలియక తచ్చట్లాడుతుంటే
చేతికర్రై చేయూతను అందించావు
ఒంటరి ప్రయాణంలో సాహచర్యంలో ఉన్న
గొప్పదనం ఏమిటో రుచి చూపించావు ..
అప్పుడు ప్రతి నిమిషం ..ఓ అధ్బుతం అనిపించింది
ఇద్దరం ఒకే స్వరమై..ఒకే హృదయమై ..ఒకే గుండె గొంతుకై
కలిసి పోయాము ..కమ్మని కబుర్లు చెప్పుకున్నాము
నింగి నేలను ముద్దాడినట్టు
చందమామ సూర్యుడిని తాకినట్టు
జలధి జగతిని చేతిలోకి తీసుకున్నట్టు ...సాగిపోయింది ...
ప్రేమ మొలకెత్తిన సమయంలో నేను నీ గుండెల మీద వాలిపోయా
అంతులేని ..అవధులు లేని ఆనందాన్ని చవిచూసా ..
ఒక్కసారి ఆకాశంలో నుంచి కిందకు నెట్టావు..
నన్ను కాదని వెళ్ళావు..మరొకరి సమక్షంలో నవ్వుతున్నావు
నిజాన్ని కాదని అబ్దదంతో ఉంటున్నా అని తెల్సుకోలేక పోతున్నావు..
మరొకరి సమక్షంలో ఉండ బట్టే చచ్చిపో అంటున్నావు నీకిది న్యాయమా
నివు నమ్మేవి అన్నీ నిజాలు కాదని అంతా బ్రమలే అని తెల్సుకునే రోజొస్తుంది