నువ్వే నువ్వంటే నాకిష్టం ..
"ఐ లవ్ యూ...నీవంటే నాకు రెస్పెక్టు..అని ఎన్నో అన్నావు", అన్న నీ మాటలకు మురసి...
ఈ ప్రపంచాన్నే నీ పాదాల చెంతకి తీసుకు రావాలని ...
పరిగెత్తాను రా.....
ఒళ్ళు మరచి, నన్ను మరచి, పరిగెత్తాను రా.........
నా ఆకలి .. ఆశలను చంపుకొని..
వెన్నెల వెలుగులను దోసిలిలో నింపుకొని.... అవి నీ పాదాలచెంత ఉంచి
ఆ వెలుగులో నీ చిరునవ్వులు చూడాలని వెనుతిరిగి చూస్తే ......
నువ్వు వేరొకరి చిటికిన వేలు పట్టుకొని అసలు నేను బ్రతికున్నానో చనిపోతానో అన్న దిగులు లేకుండా.. నడుస్తున్నవా ............ చెలి..!!!!
బ్రతికి ఉంటే నాకేంటీ చనిపొతే నాకేంటి అంటున్నావంట అంత తప్పేంచేశానో..
అప్పుడు జరిగిన సంఘటనలు ..ఇప్పుడు నీమాటలు గుండెళ్ళో బాంబుళ్ళా పేలుతూనే ఉన్నాయి ప్రియా
ఓ గుండె పగిలినప్పుడు కారే నెత్తుటి చుక్కలే నా ఈ కవితలు