"నింగిని విదిచి నాకై నెలను చెరిన ఓ చక్కని చుక్కా
మంటలా కనిపిస్తావు నా చెంత చేరి మంచువైపోతావు
తీక్షనపు చూపుల మాటున ప్రేమను కురిపిస్తావు
మరి నేను చెంత లేకుంటే.........
దైర్యమంత వీడి బేలగ నాకై కలవరిస్తావు
నన్ను చూడాలని నన్ను చేరాలని వుందంటు
నన్ను ఒక్క క్షణమైన నిలువనీయవు.
మరి నేను నీ చెంత చేరితె.........
జగమే నీదంటావు కాదు కాదు మనదంటావు
వెన్నెలల్లె నవ్వుతావు నవ్విస్తావు
పిల్లగాలికే పరవసిస్తావు
హఠాత్తుగ ముద్దొచ్చానంటు ముద్దులు కురిపిస్తావు
మరి నేను విడిచి వెళ్ళే సమయమొస్తే.......
మరి కాసేపు వుండమంటావు
నన్ను చూడకుండ వుందలేనంటు మారం చేస్తావు
వెలుగులు చిమ్మే కళ్ళను వర్ష మేఘాలుగ మారుస్తావు
పిచ్చి పిల్ల అంటు అక్కున చేర్చుకుంటె వెన్నలల్లె నవ్వుతావు".