చీరకట్టు..తలమీద పాపటి బిళ్ళతో ఎంత అందంగా వున్నావో..
చూశాను ఒకప్పుడు నాకు దగ్గరగా ఇప్పుడు అందనంత దూరంగా ఉన్నావు..
ఎందుకో నిన్ను బ్లూ పట్టు చీరలో చూడగానే మనసు గందరగోళం అయింది..
ఒకప్పుదు నేనున్నా అని పలుకరించిన నా నేస్తం ఇప్పుడు అందనంత దూరంగా..
ఎందుకిలా అని అడుగలేను ఎలా వున్నావని అడుగలేను..దానికి నాకు అర్హత లేదేమోకదా..
ఒకప్పుడు ఇలా చీరలొ దగ్గరకు వస్తుంటే తెలియని ఆందోళన ప్రపంచాన్ని జయించానన్న ధీమా ..?
కాని ఇప్పుడు ఎక్కడో దూరంగా ..కనిపించనంత దూరంగా నీవు ఇలా దూరం పెరుగుతూనే ఉంది
కనిపించని ప్రదేశానికి కను మరుగైయ్యే ప్రదేశానికి వెలుతున్నా.. త్వరలో
జరిగే ఘోరాలు చూడలేక ..మనసు భారాన్ని తట్టుకోలేక వెలుతున్నా..
మళ్ళీ నిన్ను ఇలా చూస్తానో లేదో..కదా..?
ఇప్పుడే కాదులే ఇంకా టైముంది.. జరిగేవి ఇక చూడలేను వినలేను ..
నిజంగా మనసెందుకో గందరగోళంగా వుంది..అయితే నీకేంటి కదా..
నీవు ఎప్పుడూ హేపీగా ఉండాలని కోరుకునే వాడీలో మొదటివాడీని అని ఎప్పుడు గుర్తిస్తావో కదా..?
నిజంగా ఈ రోజు నిన్ను చూస్తుంటే చాలా అందంగా వున్నావు..
నీవు కట్టుకున్నా బ్లూశారీ శారీకే అందాన్నిచ్చింది..
ఇంతకు మించి చెప్పే అర్హత నాకు లేదుకదా..?