ఏదో రాయాలని కూర్చున్నా
ఏమీ రావడం లేదు
బుర్రంతా బూజు పట్టిన ఫీలింగ్
జీవితం రాదారి మీద దూసుకుపోతున్న ఆలోచనలు
ఏదీ నిలకడగా ఆగందే!
ఆ!.. నా పిచ్చి గానీ, ఆగి చూసే తీరిక ఓపిక
ఇప్పుడెవరికి ఉన్నాయనీ!
ఆరాటం ఆరాటం
ఏదో సాధించాలనే ఆరాటం
అందరూ అదే పోరాటం
ఏదీ లేకుండా ఉండడం కూడా ఒక జబ్బేమో!...
ఇదే ఇప్పుడు నా అనుమానం
ఒక సారి ఎగ్సిట్ తీసుకున్నాక
మళ్ళీ హైవే ఎక్కాలంటే 'అబ్బా...తప్పదా?!..'
అని మూలుగుతున్న మనసు
అంతా బధ్ధకమే అంటావా?! లేక...
కొత్తగా ఏముందిలే?! - అనే వైరాగ్యమా?!...
ఎప్పుడూ నదిలా సాగే జీవితం
ఒక్కసారిగా పక్కనే ఆగిన చెత్తలో
ప్లాస్టిక్ బాటిల్లా అనిపిస్తుందేమిటి?!...
రెస్ట్ ఏరియాలో
మరీ ఎక్కువ సేపు ఆగడం వల్ల
వచ్చిన ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనుకుంటా...
-YaminiCR