"నువ్వు నాతో లేని క్షణం"
"నా నుంచి సంతోషం వేరవుతుంది
నువ్వు దూరమైనంత తేలికగా..."
ఇన్నాళ్లూ మోసపుచ్చిన జ్ఞాపకాలు
ఒకేసారి బావుర్మన్నాయి
ఏవేవో కలలు వెక్కిరించిన ఆశలు
అవ్యక్తమయ్యాయి....
"ఇక ఒక నిజం బద్దాకంగా నిద్రలేచి
మనో మైదానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది"
ఏమీ తోచని నేను
ఆత్మహత్యను అన్వేషిస్తూ
బ్రతుకు దారుల్లో పరిభ్రమిస్తూ, భ్రమిస్తూ
కన్నీళ్ళ ప్రక్కదారుల్లోకి జారిపోతున్నా...!
ప్రేమ సాగరానికి దూరంగా, అభిముఖంగా ప్రవహిస్తున్నా!
ఏదో తెలీని అడ్డుగోడ ఎదురై ఉనికిని ప్రశ్నిస్తే
వెనుతిరిగా..........
అప్పుడే తెలిసింది
"నువ్వు నాతొలేవు..." ....?
.........................నీ